e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

నిందితుడు అరెస్టు.. రిమాండ్‌కు తరలింపు

జ్యోతిబాపూలే హాస్టల్‌లో వార్డెన్ ఉద్యోగం పేరుతో రూ.5.50 లక్షల మోసం

నిందితుడు అరెస్టు.. రిమాండ్‌కు తరలింపు | చెక్కులు ఇచ్చినా బౌన్స్ | మావల పోలీసుల కేసు

మన భారత్, మావల, అక్టోబర్ 6: ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ మహిళ నుంచి రూ.5.50 లక్షలు వసూలు చేసి మోసం చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. జ్యోతిబాపూలే హాస్టల్‌లో వార్డెన్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని, అనంతరం ఉద్యోగం ఇప్పించకపోవడంతో పాటు డబ్బులు తిరిగి చెల్లిస్తానని ఇచ్చిన చెక్కులు సైతం బౌన్స్ కావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మావల పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

విడతల వారీగా రూ.5.50 లక్షల వసూలు

పోలీసుల వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ రాంనగర్‌కు చెందిన ఎర్రోజు కృష్ణవేణి తన భర్త స్నేహితుడైన సంజయ్‌నగర్‌కు చెందిన ఆరే ప్రవీణ్‌ను ఉద్యోగం విషయమై సంప్రదించారు. ఈ క్రమంలో జ్యోతిబాపూలే హాస్టల్‌లో వార్డెన్ ఉద్యోగం ఇప్పిస్తానని, అందుకు రూ.5.50 లక్షలు ఖర్చవుతాయని ప్రవీణ్ ఆమెను నమ్మించినట్లు పోలీసులు తెలిపారు.

అతని మాటలు నమ్మిన బాధితురాలు 22 ఆగస్టు 2023న రూ.1 లక్ష, 15 సెప్టెంబర్ 2023న రూ.1.50 లక్షలు చెల్లించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం డాక్యుమెంటేషన్ ప్రక్రియ పూర్తయిందని చెప్పి మరిన్ని డబ్బులు కోరడంతో 5 నవంబర్ 2023న రూ.40 వేలు, 6 నవంబర్ 2023న మరో రూ.20 వేలను ఫోన్‌పే ద్వారా చెల్లించినట్లు తెలిపారు.

తర్వాత ఉద్యోగ నియామక ఉత్తర్వుల కాపీ ఇప్పిస్తానని చెప్పడంతో మరో రూ.2 లక్షలు, రూ.40 వేలు చెల్లించినట్లు బాధితురాలు పోలీసులకు వివరించారు. ఇలా విడతల వారీగా మొత్తం రూ.5.50 లక్షలు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఉద్యోగం రాకపోవడంతో డబ్బుల కోసం ప్రశ్నించిన బాధితురాలు

డబ్బులు తీసుకున్న అనంతరం నిందితుడు తనకు సరిగా స్పందించకుండా తప్పించుకోవడంతో బాధితురాలు ఉద్యోగం విషయమై ప్రశ్నించినట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వం మారడంతో ఉద్యోగం ఇప్పించలేకపోయానని, తీసుకున్న డబ్బులను తిరిగి చెల్లిస్తానని నిందితుడు చెప్పినట్లు పేర్కొన్నారు.

ఈ క్రమంలో 20 జూలై 2024న బాధితురాలికి ఓ చెక్కు ఇచ్చినప్పటికీ, బ్యాంకు ఖాతాలో తగినంత నగదు లేకపోవడంతో అది బౌన్స్ అయినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం కూడా డబ్బులు చెల్లించకుండా ప్రామిసరీ నోట్, బాండ్ పేపర్‌పై రాసి మరో రూ.2 లక్షల చెక్కు ఇచ్చినప్పటికీ అది కూడా బౌన్స్ అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

కేసు నమోదు.. నిందితుడు అరెస్టు

తప్పుడు హామీతో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తన నుంచి రూ.5.50 లక్షలు తీసుకుని మోసం చేశాడని బాధితురాలు మావల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా మావల పోలీస్ స్టేషన్‌లో క్రైం నంబర్ 695/2025, సెక్షన్ 420 ఐపీసీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా నిందితుడు ఆరే ప్రవీణ్, తండ్రి లక్ష్మణ్, సంజయ్‌నగర్, ఆదిలాబాద్ ను పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు మావల సీఐ బీడీ ప్రేమ్ కుమార్ తెలిపారు.

ఉద్యోగాల పేరుతో డబ్బులు ఇవ్వొద్దు

ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వ్యక్తులను నమ్మి ముందుగా డబ్బులు చెల్లించవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. ఉద్యోగ నియామక ప్రక్రియ, అధికారిక ఉత్తర్వులు, ప్రభుత్వ నోటిఫికేషన్లను తప్పనిసరిగా పరిశీలించాలని తెలిపారు. ఇలాంటి ఉద్యోగ మోసాలకు గురైన వారు ఆలస్యం చేయకుండా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సూచించారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE