e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

మొగుళ్లపల్లి మండల కేంద్రంలో వింత రాజకీయం..!

పంచాయతీ పాలకవర్గం లేకుండానే ప్రభుత్వ కార్యాలయాల్లో తనిఖీల పేరిట వార్డు మెంబర్ల హల్ చల్

మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 28, (మన భారత్):

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో వింత పొగడలతో కూడిన రాజకీయాన్ని ప్రజలు కనులారా చూస్తున్నారు. వార్డు మెంబర్ గా గెలిస్తే..తమ వార్డు సమస్యలను పరిష్కరిస్తారని భావించిన ప్రజలకు మాత్రం నిరాశే మిగిలింది. వార్డు సమస్యలపై దృష్టి సారించాల్సిన వార్డు మెంబర్లు యూనియన్ పేరుతో పంచాయతీ పాలకవర్గం ఆమోదం లేకుండానే ప్రభుత్వ కార్యాలయాల్లో తనిఖీల పేరిట హల్ చల్ చేస్తున్నారు. సోమవారం వార్డు మెంబర్ల యూనియన్ పేరుతో తనిఖీల పేరిట మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను సందర్శించారు. అందులో వార్డు మెంబర్లుగా గెలిచిన సతీమణులకు బదులు భర్తలు ఆ తనిఖీలలో పాల్గొని ప్రభుత్వ అధికారులకు సూచనలు ఇవ్వడం దేనికి నిదర్శనం అని ప్రజానీకం ప్రశ్నిస్తుంది. ముఖ్యంగా టేకుమట్ల మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ లో ఆపరేటర్ గా పని చేస్తున్న తిప్పారపు రాజు అనే వ్యక్తి తాను చేసే వృత్తిని మరిచి రాజకీయాల్లో తలదూర్చుతూ..వార్డు మెంబర్ లతో కలిసి ప్రభుత్వ కార్యాలయాల్లో సందర్శించడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.తనిఖీల పేరిట అదే ప్రభుత్వ ఉద్యోగులను ప్రశ్నించే అధికారం నీకు ఎవ్వరు ఇచ్చారని పలువురు ప్రశ్నిస్తున్నారు.రాజకీయ అవతారం ఎత్తి..తన భార్య స్థానంలో ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించిన తిప్పారపు రాజుపై సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికైనా వార్డు సభ్యులుగా గెలిచినవారు తమ తమ వార్డు సమస్యలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE