నెల రోజుల్లోనే వ్యవసాయ విద్యుత్ సౌకర్యం.. ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం
డీడీలు చెల్లించిన వెంటనే స్పందన.. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా ప్రారంభం
మన భారత్, సెప్టెంబర్ 23, ఆదిలాబాద్: ఆదిలాబాద్ రూరల్ మండలం జందాపూర్ గ్రామ రైతులకు వ్యవసాయ విద్యుత్ సౌకర్యం త్వరితగతిన అందడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. డీడీలు చెల్లించిన నెల రోజుల్లోపే ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి వ్యవసాయానికి విద్యుత్ సరఫరా అందుబాటులోకి తీసుకురావడంపై రైతులు విద్యుత్ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
జందాపూర్ గ్రామానికి చెందిన రైతులు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం డీడీలు చెల్లించిన అనంతరం తమ సమస్యను విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రైతుల సమస్యపై స్పందించిన ఏఈ సతీష్‌కుమార్ సంబంధిత ప్రక్రియను వేగవంతం చేయడంతో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా అందించారు. దీంతో వ్యవసాయ పనులకు విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
విద్యుత్ సరఫరా, వ్యవసాయ కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించిన సమస్యలపై ఏఈ సతీష్‌కుమార్ వెంటనే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని రైతులు పేర్కొన్నారు. రైతుల సమస్యను త్వరితగతిన పరిష్కరించినందుకు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.
వ్యవసాయానికి విద్యుత్ సరఫరా సక్రమంగా అందితే పంటల సాగులో రైతులకు ఇబ్బందులు తగ్గుతాయని, తమ అవసరానికి అనుగుణంగా విద్యుత్ సౌకర్యం కల్పించడం సంతోషకరమని రైతులు తెలిపారు. భవిష్యత్తులోనూ విద్యుత్ సంబంధిత సమస్యల పరిష్కారానికి అధికారులు ఇదే విధంగా స్పందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దేవీదాస్, పుప్పాలింగన్న, పసుల మల్లయ్య, అడ్వకేట్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
