రిమ్స్‌ ఘటన బాధిత కుటుంబానికి కవిత పరామర్శ..

Published on

-Advertisement-

గిన్నెరలో రిమ్స్‌ ఘటన బాధిత కుటుంబానికి కవిత పరామర్శ

చిన్నారి తల్లి, కుటుంబ సభ్యులకు ధైర్యం.. అండగా ఉంటామని భరోసా | గ్రామస్తులతో సమావేశమై స్థానిక సమస్యలపై ఆరా

మన భారత్, ఇంద్రవెల్లి: సెప్టెంబర్ 23, ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రిలోని SNCUలో జరిగిన అగ్నిప్రమాదంలో చిన్నారిని కోల్పోయిన కుటుంబాన్ని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. బుధవారం ఇంద్రవెల్లి మండలంలోని గిన్నెర గ్రామానికి చేరుకున్న ఆమె మృతిచెందిన చిన్నారి తల్లి, కుటుంబ సభ్యులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారూ.

ఈ సందర్భంగా చిన్నారి కుటుంబ సభ్యులకు కవిత ధైర్యం చెప్పారు. విషాద సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చిన్నారిని కోల్పోయిన కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితులపై ఆరా తీసి, వారి బాధలను తెలుసుకున్నారు.

అనంతరం గిన్నెర గ్రామస్తులతో కవిత సమావేశమయ్యారు.ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, స్థానికంగా అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర ప్రజా సమస్యలపై గ్రామస్తులతో చర్చించారు.

రిమ్స్‌ ఘటన నేపథ్యంలో కవిత ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటిస్తూ బాధిత చిన్నారుల కుటుంబాలను పరామర్శిస్తున్నారు. అనంతరం రిమ్స్‌ ఆసుపత్రిని సందర్శించి ఘటన జరిగిన SNCU ప్రాంతాన్ని పరిశీలించడంతో పాటు చికిత్స పొందుతున్న చిన్నారుల పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నట్లు తాజా సమాచారం వెల్లడిస్తోంది.

రిమ్స్‌ ఘటనలో చిన్నారుల మృతిపై ప్రస్తుతం వివిధ వర్గాల నుంచి స్పందనలు వస్తున్న నేపథ్యంలో, బాధిత కుటుంబాలకు సహాయం, ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాలు, వైద్య సదుపాయాలపై చర్చ కొనసాగుతోంది.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

ఆ కౌన్సిలర్ పై కేసు నమోదు..

పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు గణపతి నిమజ్జన బందోబస్తులో ఆటంకాలు.. ముగ్గురిపై కేసులు నమోదు మద్యం సేవించి ప్రజాశాంతికి...

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంలో ఏఎంసీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌ రెడ్డి.. 200...

ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం

నెల రోజుల్లోనే వ్యవసాయ విద్యుత్‌ సౌకర్యం.. ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం డీడీలు చెల్లించిన వెంటనే స్పందన.. ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు...

రిమ్స్‌ ఘటనపై కవిత తీవ్ర ఆగ్రహం.. బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి..

SNCUను పరిశీలించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించాలని డిమాండ్‌ మన భారత్, సెప్టెంబర్,23...

More like this

ఆ కౌన్సిలర్ పై కేసు నమోదు..

పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు గణపతి నిమజ్జన బందోబస్తులో ఆటంకాలు.. ముగ్గురిపై కేసులు నమోదు మద్యం సేవించి ప్రజాశాంతికి...

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంలో ఏఎంసీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌ రెడ్డి.. 200...

ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం

నెల రోజుల్లోనే వ్యవసాయ విద్యుత్‌ సౌకర్యం.. ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం డీడీలు చెల్లించిన వెంటనే స్పందన.. ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు...