26 గ్రామాల రాకపోకలకు ఆటంకం..

Published on

-Advertisement-

బ్రిడ్జిపై భారీ గుంతలు.. రాత్రివేళల్లో మరింత ప్రమాదకరం

26 గ్రామాల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు.. మరమ్మతులు చేపట్టాలని డిమాండ్

మన భారత్, తాంసి, సెప్టెంబర్ 12,భీంపూర్: భీంపూర్ మండల పరిధిలోని అంతర్రాష్ట్ర రహదారిపై నిర్మించిన బ్రిడ్జి ప్రస్తుతం ప్రమాదకరంగా మారింది. బ్రిడ్జిపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి, వర్షం కురిసిన ప్రతిసారీ వాటిలో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతల్లో నీరు నిలిచి ఉండటంతో వాటి లోతు తెలియక కొత్తగా ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది.

ఈ బ్రిడ్జి మీదుగా భీంపూర్ మండలానికి చెందిన సుమారు 26 గ్రామాల ప్రజలు నిత్యం జిల్లా, మండల కేంద్రాలకు రాకపోకలు సాగిస్తుంటారు. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు, అత్యవసర పనులపై వెళ్లే ప్రజలకు ఈ మార్గం ఎంతో కీలకంగా ఉంది. అయితే బ్రిడ్జి దెబ్బతినడంతో నిత్యం రాకపోకలు సాగించే ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

వర్షం పడితే మరింత ఇబ్బందులు

బ్రిడ్జిపై ఏర్పడిన గుంతల్లో వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు గుంతలను తప్పించే క్రమంలో అదుపుతప్పే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సైడ్ వాల్స్ లేకపోవడంతో భయం

బ్రిడ్జికి ఇరువైపులా రక్షణ గోడలు (సైడ్ వాల్స్) లేకపోవడం మరో ప్రధాన సమస్యగా మారింది. రాత్రి సమయంలో ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించే క్రమంలో వాహనం అదుపుతప్పితే వాగులో పడిపోయే ప్రమాదం లేకపోలేదని మండల వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జిపై రక్షణ చర్యలు లేకపోవడం వల్ల ప్రమాదం జరిగిన సమయంలో ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని విజ్ఞప్తి

ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బ్రిడ్జిపై ఏర్పడిన గుంతలను వెంటనే పూడ్చి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. బ్రిడ్జి నిర్మాణం పాతబడిన కారణంగా శాశ్వత పరిష్కారంగా కొత్త బ్రిడ్జిని మంజూరు చేసి నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.

26 గ్రామాల ప్రజల రాకపోకలకు కీలకమైన ఈ బ్రిడ్జిపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని మండల వాసులు కోరుతున్నారు. వర్షాకాలంలో సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున ఆలస్యం చేయకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి 

 

Latest articles

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు..

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు.. మృతుని కుటుంబానికి ఆర్థిక భరోసా చిట్యాల: అనారోగ్యంతో మృతి చెందిన తిరుమలపురం గ్రామానికి చెందిన...

ఎవరి కులమెంతో.. వారికి అంత వాటా

సామాజిక న్యాయం–రాజ్యాధికారం కోసం సెప్టెంబర్‌ 27న బహిరంగ పంచాయతీ సభ మన భారత్‌, సెప్టెంబర్‌ 19, చిట్యాల: సామాజిక న్యాయం,...

ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదు 

ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం -మొగుళ్లపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్ మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 20 (మన భారత్): వినాయక నిమజ్జన వేడుకలను...

పద్మశాలి సంఘ భవనంలో గణనాథుడిని దర్శించుకున్న మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష

పద్మశాలి సంఘ భవనంలో గణనాథుడిని దర్శించుకున్న మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష మన భారత్, సెప్టెంబర్20,...

More like this

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు..

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు.. మృతుని కుటుంబానికి ఆర్థిక భరోసా చిట్యాల: అనారోగ్యంతో మృతి చెందిన తిరుమలపురం గ్రామానికి చెందిన...

ఎవరి కులమెంతో.. వారికి అంత వాటా

సామాజిక న్యాయం–రాజ్యాధికారం కోసం సెప్టెంబర్‌ 27న బహిరంగ పంచాయతీ సభ మన భారత్‌, సెప్టెంబర్‌ 19, చిట్యాల: సామాజిక న్యాయం,...

ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదు 

ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం -మొగుళ్లపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్ మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 20 (మన భారత్): వినాయక నిమజ్జన వేడుకలను...