సిరికొండ:మన భారత్, సెప్టెంబర్ 3,
ఇటీవల రాజు యాదవ్ తమ్ముడు మృతి చెందిన విషయం తెలుసుకున్న తెలంగాణ రక్షణ సేన పార్టీ బోథ్ నియోజకవర్గ ఇంచార్జ్, రాష్ట్ర అబ్జర్వర్ రాథోడ్ బాపూరావు వారి కుటుంబాన్ని పరామర్శించారు. గురువారం సిరికొండ మండల కేంద్రంలోని రాజు యాదవ్ నివాసానికి వెళ్లిన ఆయన మృతుడి కుటుంబ సభ్యులను కలిసి వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్న రాథోడ్ బాపూరావు, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆపద సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని సూచించారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అండగా ఉంటామని రాథోడ్ బాపూరావు భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలపై కూడా ఆయన ఆరా తీశారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ ఇచ్చోడ మండల కన్వీనర్ షేక్ బిలాల్‌తో పాటు షేక్ పరిద్ద్, షేక్ మామద్, షేక్ ముస్తఫా, షేక్ కలీమ్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
