e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, October 18, 2026

అగ్ని ప్రమాదం.. స్పందించిన సర్పంచ్

అగ్ని ప్రమాదం – తక్షణమే స్పందించిన గ్రామ సర్పంచ్

మన, భారత్,మొగుళ్ళపల్లి:

మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన తిప్పారపు బుచ్చన్న వరి గడ్డి వాము మంగళవారం అర్ధరాత్రి సమయంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదానికి గురైంది. విషయం తెలుసుకున్న వెంటనే గ్రామ సర్పంచ్ చాట్ల విజయ రవీందర్ తక్షణమే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.అగ్నిప్రమాదం మరింత విస్తరించకుండా ఉండేందుకు సర్పంచ్ అగ్నిమాపక శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 1 గంట వరకు సహాయక చర్యల్లో స్వయంగా పాల్గొన్నారు. అగ్నిమాపక సిబ్బందితో కలిసి మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేశారు.సర్పంచ్ తక్షణ స్పందనతో అగ్నిప్రమాదం మరింత విస్తరించకుండా నివారించగలిగామని స్థానికులు తెలిపారు. ప్రమాద సమయంలో అందుబాటులో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించిన సర్పంచ్ చాట్ల విజయ రవీందర్‌ను స్థానికులు అభినందించారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE