e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, October 18, 2026

పర్యావరణ పరిరక్షణే నిజమైన విద్య : DEO గోవిందరాజులు

నారాయణపేట జిల్లా లోని. జిల్లాస్థాయి. ప్రభుత్వ పాఠశాలల లీడ్ ఎర్త్ లీడర్స్ కు ఒక రోజు శిక్షణ కార్యక్రమం ఘనంగా ప్రారంభం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జాజాపూర్

పర్యావరణ పరిరక్షణే నిజమైన విద్య – DEO గోవిందరాజులు
పిల్లలే భూమికి నాయకులు కావాలి – ప్రొఫెసర్ ఉపేందర్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖ, ప్రముఖ పర్యావరణ సంస్థ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ (CGR) సంయుక్త ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా ప్రభుత్వ పాఠశాలలకు చెందిన లీడ్ ఎర్త్ లీడర్స్ కు ఒక రోజు శిక్షణ కార్యక్రమం  జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అత్యంత ఉత్సాహంగా ప్రారంభమైంది. స్కూల్ ఎర్త్ క్లబ్స్ – యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రాం లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి గోవిందరాజులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు ప్రసంగం:-

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మాట్లాడిన DEO  గోవిందరాజులు , “చదువు అంటే కేవలం పాఠ్యపుస్తకాలు చదవడం, మార్కులు తెచ్చుకోవడం మాత్రమే కాదు. మనం నివసిస్తున్న భూమిని, ప్రకృతిని కాపాడుకోవడం కూడా నిజమైన విద్యలో భాగం” అని స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఎర్త్ క్లబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రతి విద్యార్థి ఒక చెట్టును నాటి, దానిని తన తోబుట్టువులా కాపాడాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ రహిత పాఠశాలలు, నీటి సంరక్షణ, పరిశుభ్రత వంటి అంశాలలో విద్యార్థులే రాయబారులుగా మారాలన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా విస్తరించేందుకు విద్యా శాఖ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

ప్రొఫెసర్ ఎన్. ఉపేందర్ రెడ్డి ప్రసంగం:-

SCERT రిటైర్డ్ ప్రొఫెసర్, ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ ఎన్. ఉపేందర్ రెడ్డి గారు కీలక ఉపన్యాసం చేశారు. ఆయన మాట్లాడుతూ, “భవిష్యత్తులో వాతావరణ మార్పుల వల్ల అత్యధికంగా నష్టపోయేది నేటి పిల్లలే. అందుకే పిల్లలే లీడ్ ఎర్త్ లీడర్స్ గా మారాలి. భూమిని నడిపించే నాయకులు కావాలి” అని అన్నారు. విద్యార్ధులు కేవలం తరగతి గదికే పరిమితం కాకుండా, ప్రకృతితో అనుసంధానం కావాలన్నారు. వాతావరణ అక్షరాస్యతను పాఠ్యాంశాల్లో భాగం చేయాలని, ప్రతి పాఠశాల ఒక జీవవైవిధ్య పార్కుగా, ప్రయోగశాలగా మారాలని సూచించారు. విద్యార్థులు ప్రశ్నించడం, పరిశీలించడం, పరిష్కారం చూపడం నేర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో DSO భాను ప్రకాష్, ఏ ఎం ఓ విద్యాసాగర్. సెక్టోరియల్ అధికారి నాగార్జున రెడ్డి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ లయన్ డా. ఎ. నటరాజ్, లయన్స్ క్లబ్ ఆఫ్ పాలమూర్ అధ్యక్షులు లయన్ డా. సి. బాబుల్ రెడ్డి, CGR వ్యవస్థాపకులు కె. లక్ష్మారెడ్డి, పుడమి పత్రిక సంపాదకులు రమేష్ రావు, నారాయణపేట డిడిఏం మహేందర్, జాజాపూర్ ZPHS ప్రధానోపాధ్యాయురాలు భారతి, ఉపాధ్యాయులు వార్ల మల్లేశం జనార్దన్ రెడ్డి సాకా రవి సత్యనారాయణ రెడ్డి, నరసింహ నర్సింలు, నిర్మల, స్వప్న, తదితరులు ప్రసంగించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుండి 20 మంది ఉపాధ్యాయులు, 160 మంది ఎర్త్ లీడర్లు (విద్యార్ధులు) సి జి ఆర్ సంస్థ ప్రతినిధులు పర్యావరణ శాస్త్రవేత ఉమా మహేశ్వర్ రెడ్డి, ఇంచార్జి నగేష్, జిల్లా కోఆర్డినేటర్స్ మద్దిలేటి,హన్మంతు ఈ శిక్షణలో పాల్గొన్నారు.

మీ విశాల్ కుమార్ మన భారత్ చీఫ్ ఎడిటర్ 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE