ఈ నెల 12 న జాతీయ లోక్ అదాలత్..

Published on

-Advertisement-

రాజీ పడదగ్గ కేసులను పరిష్కరించుకునేందుకు అవకాశం.. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి

ఆదిలాబాద్:మన భారత్, సెప్టెంబర్ ,1, కక్షిదారులు తమ కేసులను సత్వరంగా, సులభంగా పరిష్కరించుకునేందుకు ఈనెల 12వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయాధికారి కే. ప్రభాకర్ రావు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా రాజీ పడదగిన కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు.

జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో కేసుల పరిష్కారానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా కుటుంబ తగాదాలు, బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వివాదాలు, చెక్ బౌన్స్ కేసులు, రాజీ పడదగిన ఇతర కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని వివరించారు.

కేసుల పరిష్కారానికి ఎక్కువ సమయం, ఖర్చు కాకుండా ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో న్యాయపరమైన పరిష్కారం లభించేలా లోక్ అదాలత్ దోహదపడుతుందని పేర్కొన్నారు. కక్షిదారులు తమ కేసుల వివరాలను సంబంధిత న్యాయస్థానాన్ని సంప్రదించి, లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకునేందుకు ముందుకు రావాలని ఆయన సూచించారు.

లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారం వల్ల కక్షిదారులకు సమయం, న్యాయపరమైన ఖర్చులు ఆదా కావడంతో పాటు దీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదాలకు ముగింపు పలికే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాజీ మార్గంలో తమ వివాదాలను పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి కే. ప్రభాకర్ రావు కోరారు.

ఈ కార్యక్రమంలో డీఎల్ఎస్ఎ కార్యదర్శి హుస్సేన్ నాయక్ తదితరులు పాల్గొనారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

గణేశ్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్

శాంతిభద్రతలకు విఘాతం లేకుండా ఉత్సవాలు నిర్వహించాలి హైదరాబాద్, సెప్టెంబర్ 13: భాగ్యనగరంలో గణేశ్ ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంత...

ప్రజలకు నేరాల నియంత్రణపై అవగాహన..

శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్ -చిట్యాల సిఐ వై.సతీష్ మన భారత్,మొగుళ్ళపల్లి: శాంతి భద్రతలను పరిరక్షించేందుకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని చిట్యాల...

అప్రమత్తంగా విధులు నిర్వహించాలి: ఎస్పీ అఖిల్ మహాజన్

గణపతి నవరాత్రి ఉత్సవాలను సమిష్టి కృషితో విజయవంతం చేద్దాం ప్రతి గణపతి మండపానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, జియో ట్యాగింగ్ తప్పనిసరి ఉత్సవాలు...

అక్కడ గంటల తరబడి ట్రాఫిక్.!

గుడిహత్నూర్‌లో గంటల తరబడి ట్రాఫిక్.. ప్రయాణికుల అవస్థలు సుమారు 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు మన భారత్,...

More like this