రాజీ పడదగ్గ కేసులను పరిష్కరించుకునేందుకు అవకాశం.. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి
ఆదిలాబాద్:మన భారత్, సెప్టెంబర్ ,1, కక్షిదారులు తమ కేసులను సత్వరంగా, సులభంగా పరిష్కరించుకునేందుకు ఈనెల 12వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయాధికారి కే. ప్రభాకర్ రావు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా రాజీ పడదగిన కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు.
జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో కేసుల పరిష్కారానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా కుటుంబ తగాదాలు, బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వివాదాలు, చెక్ బౌన్స్ కేసులు, రాజీ పడదగిన ఇతర కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని వివరించారు.
కేసుల పరిష్కారానికి ఎక్కువ సమయం, ఖర్చు కాకుండా ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో న్యాయపరమైన పరిష్కారం లభించేలా లోక్ అదాలత్ దోహదపడుతుందని పేర్కొన్నారు. కక్షిదారులు తమ కేసుల వివరాలను సంబంధిత న్యాయస్థానాన్ని సంప్రదించి, లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకునేందుకు ముందుకు రావాలని ఆయన సూచించారు.
లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారం వల్ల కక్షిదారులకు సమయం, న్యాయపరమైన ఖర్చులు ఆదా కావడంతో పాటు దీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదాలకు ముగింపు పలికే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాజీ మార్గంలో తమ వివాదాలను పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి కే. ప్రభాకర్ రావు కోరారు.
ఈ కార్యక్రమంలో డీఎల్ఎస్ఎ కార్యదర్శి హుస్సేన్ నాయక్ తదితరులు పాల్గొనారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
