టీచర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి..

Published on

-Advertisement-

ఉపాధ్యాయ సమస్యలు వెంటనే పరిష్కరించాలి

తలమడుగు, ఆగస్టు 12, మన భారత్: పాఠశాలలు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీఎస్‌యూటీఎఫ్‌ తలమడుగు మండల అధ్యక్షుడు శంకర్ డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తహశీల్దార్‌ను కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తేనే విద్యా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.

ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే సంఘాల ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ నెల 19న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ధర్నా కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని శంకర్ పిలుపునిచ్చారు. ఉపాధ్యాయుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం సంఘాల ఐక్య పోరాటానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు శ్రీనివాస్, వినోద్,శంకర్,వినోద్ రెడ్డి,మురళీధర్,వెంకటేశ్వర్,రమేష్,,సంతోష్, నగేష్,తదితరులు పాల్గొని తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

గణేశ్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్

శాంతిభద్రతలకు విఘాతం లేకుండా ఉత్సవాలు నిర్వహించాలి హైదరాబాద్, సెప్టెంబర్ 13: భాగ్యనగరంలో గణేశ్ ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంత...

ప్రజలకు నేరాల నియంత్రణపై అవగాహన..

శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్ -చిట్యాల సిఐ వై.సతీష్ మన భారత్,మొగుళ్ళపల్లి: శాంతి భద్రతలను పరిరక్షించేందుకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని చిట్యాల...

అప్రమత్తంగా విధులు నిర్వహించాలి: ఎస్పీ అఖిల్ మహాజన్

గణపతి నవరాత్రి ఉత్సవాలను సమిష్టి కృషితో విజయవంతం చేద్దాం ప్రతి గణపతి మండపానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, జియో ట్యాగింగ్ తప్పనిసరి ఉత్సవాలు...

అక్కడ గంటల తరబడి ట్రాఫిక్.!

గుడిహత్నూర్‌లో గంటల తరబడి ట్రాఫిక్.. ప్రయాణికుల అవస్థలు సుమారు 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు మన భారత్,...

More like this