e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, October 17, 2026

బావిలో పడి కాంట్రాక్ట్ లెక్చరర్ మృతి..

వ్యవసాయ బావిలో పడి కాంట్రాక్ట్ లెక్చరర్ మృతి

తలమడుగు, ఆగస్టు 12, మన భారత్: తలమడుగు మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రుయ్యాడి గ్రామానికి చెందిన కాంట్రాక్ట్ లెక్చరర్ ప్రసాద్ (45) వ్యవసాయ బావిలో పడి మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రసాద్ కొంతకాలంగా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. మంగళవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.

బుధవారం ప్రసాద్ మృతదేహం గ్రామ సమీపంలోని ఆయన వ్యవసాయ బావిలో కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని బావి నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రసాద్ బావిలో పడటానికి గల కారణాలపై వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాత ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ప్రసాద్ మృతితో రుయ్యాడి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE