e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, October 17, 2026

నిమ్మల గజానన్ కు అభినందనలు..

నిమ్మల గజానన్ కలిసి అభినందనలు తెలిపిన బిఆర్ఎస్ అధికార ప్రతినిధి

కజ్జర్ల గ్రామంలో ఘన సన్మానం.. అభినందనలు తెలిపిన బోథ్ బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి మొట్టె కిరణ్ కుమార్

తలమడుగు, ఆగస్టు 3 (మన భారత్): తెలంగాణ రక్షణ సేన పార్టీ తలమడుగు మండల అధ్యక్షుడిగా నిమ్మల గజానన్ ఎన్నికైన సందర్భంగా కజ్జర్ల గ్రామంలో ఆయనకు ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి మొట్టె కిరణ్ కుమార్ పాల్గొని నిమ్మల గజానన్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా మొట్టె కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. నిమ్మల గజానన్ తలమడుగు మండల అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం అభినందనీయమన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. మండలంలోని గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేయాలని సూచించారు.

అనంతరం తెలంగాణ రక్షణ సేన తలమడుగు మండల అధ్యక్షుడు నిమ్మల గజానన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో మండల అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తన ఎన్నిక సందర్భంగా కజ్జర్ల గ్రామంలో సన్మానించి అభినందనలు తెలిపిన కిరణ్ అన్నగారికి సర్వదా కృతజ్ఞతుడిని అని పేర్కొన్నారు.

మండలంలోని ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని నిమ్మల గజానన్ తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సహకారంతో తెలంగాణ రక్షణ సేనను తలమడుగు మండలంలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని నిమ్మల గజానన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి ఆదిలాబాద్ 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేసి వివరాలు పంపండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE