ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి: కలెక్టర్

Published on

-Advertisement-

ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి: కలెక్టర్ రాజర్షి షా

డబుల్ ఓటర్లు వెంటనే ఒకే ప్రాంతంలో ఓటు కొనసాగించేలా నిర్ణయం తీసుకోవాలి

మన భారత్, జూలై 23 ఆదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లాలో ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటు హక్కు నమోదైన డబుల్ ఓటర్లు వెంటనే తమకు అనుకూలమైన ఒకే ప్రాంతంలో ఓటు కొనసాగించేలా నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమైందని, అయితే ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండేలా ఓటరు జాబితాల్లో పారదర్శకత, ఖచ్చితత్వం ఉండాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ రాజర్షి షా మాట్లాడారు. జిల్లాలో ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటు హక్కు నమోదైన వ్యక్తులు తమ ఓటును ఒకే ప్రాంతంలో కొనసాగించేందుకు నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

డబుల్ ఓటర్లుగా గుర్తించిన వ్యక్తులు మరో ప్రాంతంలోని ఓటును తొలగించేందుకు అవసరమైన ఎన్యుమరేషన్ ఫారాలను సిద్ధం చేసి, రెండు నుంచి మూడు రోజుల్లోగా సంబంధిత బూత్ లెవల్ అధికారులకు అందజేయాలని కలెక్టర్ సూచించారు. ఈ ప్రక్రియను ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఓటరు జాబితాల సవరణ ప్రక్రియలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ స్థాయి అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడటంతో పాటు, ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు నమోదుకాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ ఆదిలాబాద్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

గణేశ్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్

శాంతిభద్రతలకు విఘాతం లేకుండా ఉత్సవాలు నిర్వహించాలి హైదరాబాద్, సెప్టెంబర్ 13: భాగ్యనగరంలో గణేశ్ ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంత...

ప్రజలకు నేరాల నియంత్రణపై అవగాహన..

శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్ -చిట్యాల సిఐ వై.సతీష్ మన భారత్,మొగుళ్ళపల్లి: శాంతి భద్రతలను పరిరక్షించేందుకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని చిట్యాల...

అప్రమత్తంగా విధులు నిర్వహించాలి: ఎస్పీ అఖిల్ మహాజన్

గణపతి నవరాత్రి ఉత్సవాలను సమిష్టి కృషితో విజయవంతం చేద్దాం ప్రతి గణపతి మండపానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, జియో ట్యాగింగ్ తప్పనిసరి ఉత్సవాలు...

అక్కడ గంటల తరబడి ట్రాఫిక్.!

గుడిహత్నూర్‌లో గంటల తరబడి ట్రాఫిక్.. ప్రయాణికుల అవస్థలు సుమారు 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు మన భారత్,...

More like this