ఆ సర్పంచ్ సస్పెండ్ .!

Published on

-Advertisement-

నకిలీ పత్తి విత్తనాల కేసు.. దాబా(బి) సర్పంచ్ సస్పెన్షన్

మన భారత్ | ఆదిలాబాద్

ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల విక్రయానికి సంబంధించిన కేసులో ఇచ్చోడ మండలం దాబా(బి) గ్రామ సర్పంచ్ ఈశ్వర్‌పై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. వ్యవసాయాధికారుల నివేదిక, సంబంధిత శాఖల విచారణ ఆధారంగా సర్పంచ్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇటీవల టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిర్వహించిన దాడుల్లో నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అనంతరం సర్పంచ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై వ్యవసాయ శాఖ అధికారులు సమగ్ర నివేదికను జిల్లా యంత్రాంగానికి సమర్పించారు.

ఈ నివేదిక ఆధారంగా జిల్లా పంచాయతీ అధికారి సర్పంచ్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయగా, ఆయన సమర్పించిన వివరణ సంతృప్తికరంగా లేదని అధికారులు నిర్ధారించారు. దీంతో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని నిబంధనల మేరకు సర్పంచ్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

నకిలీ విత్తనాల విక్రయం రైతులకు తీవ్ర నష్టం కలిగించే చర్యగా అధికారులు పేర్కొంటూ, ఇటువంటి అక్రమాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రైతులు ధృవీకరించిన విక్రయ కేంద్రాల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని, అనుమానాస్పద విత్తనాలపై వెంటనే వ్యవసాయ శాఖ లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

ఆ గ్రామానికి జిల్లా కలెక్టర్ పేరు..!

ఆ గ్రామానికి ఆదిలాబాద్ కలెక్టర్ పేరు ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 13: గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ...

ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు

ఎన్టీఆర్ చౌరస్తాలో ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు ఆదిలాబాద్, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో...

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

కప్పర్లలో కేమా సదానందం కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరామర్శ తాంసీ, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్...

532 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం..

ఎండు గంజాయి స్వాధీనం మొగుళ్లపల్లి, ఆగస్టు 13: అక్రమంగా ఎండు గంజాయిని తరలిస్తున్న యువకుడిని మొగుళ్లపల్లి పోలీసులు అరెస్టు చేసి,...

More like this