వర్షంలో గంటల తరబడి ప్రయాణికుల నిరీక్షణ..

Published on

-Advertisement-

తలమడుగులో ఆర్టీసీ బస్సు క్లచ్ ప్లేట్లు ఫెయిల్.. వర్షంలో గంటల తరబడి ప్రయాణికుల నిరీక్షణ

మన భారత్, జూలై 21 తలమడుగు:

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు క్లచ్ ప్లేట్లు అకస్మాత్తుగా ఫెయిల్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదిలాబాద్ నుంచి కోసాయి గ్రామం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు తలమడుగు మండల కేంద్రానికి చేరుకున్న తర్వాత ఒక్కసారిగా నిలిచిపోవడంతో వర్షంలోనే ప్రయాణికులు దాదాపు రెండు నుంచి మూడు గంటలపాటు బస్సులోనే వేచి ఉండాల్సి వచ్చింది.

సమాచారం అందుకున్న వెంటనే బస్సు డ్రైవర్ పరిస్థితిని ఆదిలాబాద్ డిపో అధికారులకు తెలియజేశారు. దీనిపై స్పందించిన డిపో మేనేజర్ ప్రత్యామ్నాయ బస్సును ఏర్పాటు చేసి, నిలిచిపోయిన బస్సులో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా మరో బస్సులో వారి గమ్యస్థానాలకు పంపించారు. అధికారుల తక్షణ స్పందనతో చివరకు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే ఈ ఘటనపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మార్గంలో నడిచే బస్సులు తరచూ సాంకేతిక లోపాలకు గురవుతున్నాయని, గతంలో కూడా ఇదే తరహా ఘటనలు చోటుచేసుకున్నాయని వారు పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ రూట్‌లో నడిచే బస్సులను పూర్తిస్థాయిలో తనిఖీ చేసి, అవసరమైతే కొత్త లేదా మెరుగైన బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.

అలాగే కోసాయి, పరిసర గ్రామాల నుంచి ఆదిలాబాద్‌కు ఉద్యోగాలు, ప్రైవేట్ పనుల నిమిత్తం రోజూ రాకపోకలు సాగించే వారు రాత్రి వేళల్లో నైట్ హాల్ట్ బస్సు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సాయంత్రం తర్వాత రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు.

ఈ సమస్యను సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామాల సర్పంచులు దృష్టికి తీసుకెళ్లి, ఆదిలాబాద్–కోసాయి మార్గంలో నైట్ హాల్ట్ బస్సును వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజల రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్.

ఆదిలాబాద్ జిల్లాలో పని చేయుటకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

ఆ గ్రామానికి జిల్లా కలెక్టర్ పేరు..!

ఆ గ్రామానికి ఆదిలాబాద్ కలెక్టర్ పేరు ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 13: గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ...

ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు

ఎన్టీఆర్ చౌరస్తాలో ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు ఆదిలాబాద్, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో...

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

కప్పర్లలో కేమా సదానందం కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరామర్శ తాంసీ, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్...

532 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం..

ఎండు గంజాయి స్వాధీనం మొగుళ్లపల్లి, ఆగస్టు 13: అక్రమంగా ఎండు గంజాయిని తరలిస్తున్న యువకుడిని మొగుళ్లపల్లి పోలీసులు అరెస్టు చేసి,...

More like this

ఆ గ్రామానికి జిల్లా కలెక్టర్ పేరు..!

ఆ గ్రామానికి ఆదిలాబాద్ కలెక్టర్ పేరు ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 13: గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ...

ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు

ఎన్టీఆర్ చౌరస్తాలో ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు ఆదిలాబాద్, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో...

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

కప్పర్లలో కేమా సదానందం కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరామర్శ తాంసీ, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్...