పల్సి కెలో బీజేపీకి షాక్..

Published on

-Advertisement-

మన భారత్, తలమడుగు

పల్సి కెలో బీజేపీకి షాక్.. సర్పంచ్, ఉపసర్పంచ్‌తో పాటు పలువురు బీఆర్ఎస్‌లో చేరిక

తలమడుగు, జూలై 16: తలమడుగు మండలంలోని పల్సి కె గ్రామంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గ్రామ సర్పంచ్ నైతం చిన్ను, ఉపసర్పంచ్ దుర్వా సురేష్ తో పాటు బీజేపీకి చెందిన పలువురు కార్యకర్తలు, గ్రామస్తులు గురువారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ చేరికలతో పల్సి కె గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు, యువకులు, రైతులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ వైపు అడుగులు వేయడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ప్రజల విశ్వాసమే బీఆర్ఎస్ బలం: ఎమ్మెల్యే అనిల్ జాదవ్

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, గ్రామీణాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు పనిచేసిందన్నారు. ప్రజల విశ్వాసం కారణంగానే పార్టీ రోజురోజుకు బలోపేతం అవుతోందని పేర్కొన్నారు.

పల్సి కె గ్రామానికి చెందిన యువత, రైతులు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా పార్టీలో చేరడం బీఆర్ఎస్‌పై ప్రజల్లో ఉన్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా మరింత మంది వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

అలాగే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీల అమలులో విఫలమైందని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సామర్థ్యం బీఆర్ఎస్‌కే ఉందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో , నాయకులు కేదారేశ్వర్ రెడ్డి, అభిరాం రెడ్డి, శ్రీనివాస్, రాంబాయి, లచురాం, పునాజీ, రమేష్, పల్సి బి సర్పంచ్ లక్ష్మణ్, తొడసం ఉమేష్, మాంకు, జంగుబాయి, సలాం రఘునాథ్, నైతం రాంప్రసాద్, మారుతి మహరాజ్, దుర్వా సుదర్శన్, నైతం అశోక్ తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్..

మన భారత్ లో పని చేయుటకు జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గ, మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...

గ్రామ పంచాయతీలకు శుభవార్త..

ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ప్రభుత్వం కీలక నిర్ణయం పంచాయతీరాజ్ చట్టంలో సవరణకు రంగం సిద్ధం.. గ్రామాభివృద్ధి పనులకు నిధుల వినియోగం...

మీరు రిపోర్టర్ కావాలని అనుకుంటున్నారా.!

రిపోర్టర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నారా? ఇదే మీకు సువర్ణావకాశం! సమాజ సమస్యలను వెలుగులోకి తీసుకురావాలనే ఆసక్తి ఉన్న వారికి 'మన భారత్'లో...

నకిలీ రూ.500 నోటు కలకలం..

ఆసిఫాబాద్ జిల్లాలో నకిలీ రూ.500 నోటు కలకలం బ్యాంకులో గుర్తించిన అధికారులు.. నగదు లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలని సూచన మన భారత్, ఆసిఫాబాద్: కొమురం...

More like this

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...

గ్రామ పంచాయతీలకు శుభవార్త..

ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ప్రభుత్వం కీలక నిర్ణయం పంచాయతీరాజ్ చట్టంలో సవరణకు రంగం సిద్ధం.. గ్రామాభివృద్ధి పనులకు నిధుల వినియోగం...

మీరు రిపోర్టర్ కావాలని అనుకుంటున్నారా.!

రిపోర్టర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నారా? ఇదే మీకు సువర్ణావకాశం! సమాజ సమస్యలను వెలుగులోకి తీసుకురావాలనే ఆసక్తి ఉన్న వారికి 'మన భారత్'లో...