యూరియా యాఫ్ ను రద్దు చేయాలి

Published on

-Advertisement-

యూరియా యాఫ్ ను తక్షణమే రద్దు చేయాలి

బీఆర్ఎస్ యువజన నాయకుడు రాస ప్రశాంత్

మన భారత్, మొగుళ్ళపల్లి:

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ విధానం వల్ల సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీన్ని తక్షణమే రద్దు చేసి, పాత పద్ధతిలోనే యూరియా పంపిణీ చేయాలని బీఆర్ఎస్ యువజన నాయకుడు రాస ప్రశాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యాప్ పనితీరు సక్రమంగా లేకపోవడం, నిరక్షరాస్యులైన రైతులకు స్మార్ట్‌ఫోన్‌ల వాడటం కష్టంగా మారడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఈ యాప్ విధానంపై రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సాంకేతిక యాప్ ద్వారా బుక్ చేసుకున్నప్పటికీ, దుకాణాల్లో యూరియా నిల్వలు లేవని చెప్పడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అవగాహన లేకపోవడం ఎక్కువ మంది రైతులకు స్మార్ట్‌ఫోన్ వాడకం, యాప్ ఆపరేట్ చేయడం తెలియదన్నారు. ఈ యాప్ విధానాన్ని ఎత్తివేయాలని కోరుతూ రైతాంగం పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటాలను చేస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రవేశపెట్టిన యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

ఆ గ్రామానికి జిల్లా కలెక్టర్ పేరు..!

ఆ గ్రామానికి ఆదిలాబాద్ కలెక్టర్ పేరు ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 13: గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ...

ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు

ఎన్టీఆర్ చౌరస్తాలో ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు ఆదిలాబాద్, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో...

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

కప్పర్లలో కేమా సదానందం కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరామర్శ తాంసీ, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్...

532 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం..

ఎండు గంజాయి స్వాధీనం మొగుళ్లపల్లి, ఆగస్టు 13: అక్రమంగా ఎండు గంజాయిని తరలిస్తున్న యువకుడిని మొగుళ్లపల్లి పోలీసులు అరెస్టు చేసి,...

More like this