ప్రభుత్వ ఖాళీ ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలి: సీపీఎం

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్

ప్రభుత్వ ఖాళీ ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలి: సీపీఎం

జూలై 15న హైదరాబాద్‌లో జరిగే నిరుద్యోగుల మహాధర్నాకు భారీగా తరలిరావాలని పిలుపు

ఆదిలాబాద్, జూలై 13 (మన భారత్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జూలై 15న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించే నిరుద్యోగుల మహాధర్నాను విజయవంతం చేయాలని ఆయన నిరుద్యోగ యువతీ యువకులకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆదిలాబాద్‌లోని సుందరయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న సుమారు 10 లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి నియామక ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఆలస్యం చేయకుండా తక్షణమే నోటిఫికేషన్లు జారీ చేయాలని ఆయన కోరారు. ముఖ్యంగా పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న సుమారు 20 వేల కానిస్టేబుల్ పోస్టులను అత్యవసరంగా భర్తీ చేసి నిరుద్యోగులకు అవకాశాలు కల్పించాలని అన్నారు.

ఉద్యోగాలు లభించే వరకు నిరుద్యోగ యువతకు నెలకు రూ.5,000 చొప్పున నిరుద్యోగ భృతి అందించాలని, అలాగే రాజీవ్ యువ వికాస్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాలను కోరారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వాలు స్పష్టమైన కార్యాచరణతో ముందుకు రావాలని ఆయన పేర్కొన్నారు.

జూలై 15న హైదరాబాద్‌లో నిర్వహించనున్న మహాధర్నాలో జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తమ హక్కుల కోసం గొంతెత్తాలని సీపీఎం నాయకత్వం పిలుపునిచ్చింది.

ఈ మీడియా సమావేశంలో సీపీఎం సీనియర్ నాయకులు బండి దత్తాత్రి, జిల్లా కమిటీ సభ్యులు ఆర్. మంజుల, ఎన్. స్వామి, నాయకులు అరిఫా బేగం, రాములు, మమత తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ ఆదిలాబాద్ జిల్లాలో మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

ఆ గ్రామానికి జిల్లా కలెక్టర్ పేరు..!

ఆ గ్రామానికి ఆదిలాబాద్ కలెక్టర్ పేరు ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 13: గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ...

ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు

ఎన్టీఆర్ చౌరస్తాలో ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు ఆదిలాబాద్, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో...

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

కప్పర్లలో కేమా సదానందం కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరామర్శ తాంసీ, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్...

532 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం..

ఎండు గంజాయి స్వాధీనం మొగుళ్లపల్లి, ఆగస్టు 13: అక్రమంగా ఎండు గంజాయిని తరలిస్తున్న యువకుడిని మొగుళ్లపల్లి పోలీసులు అరెస్టు చేసి,...

More like this