e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

ముక్కోటి దేవుళ్ల అనుగ్రహం ప్రజలపై ఉండాలి: కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము

మన భారత్, మొగుళ్లపల్లి:
ముక్కోటి దేవుళ్ల ఆశీస్సులు మొగుళ్లపల్లి మండల ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కాంగ్రెస్ పార్టీ మొగుళ్లపల్లి మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము ప్రార్థించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, పాడి పంటలతో, అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటూ ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నడిగోటి రాము నేతృత్వంలో మొగుళ్లపల్లి గ్రామానికి చెందిన యువకులు ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా తిరుపతి సమీపంలోని మంగాపురంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం రామచంద్రపురం రాయల చెరువు ఒడ్డున పాతాళ అడుగులో వెలసిన అష్టదశ శక్తి పీఠాలలో ఐదవ పీఠంగా ప్రసిద్ధి చెందిన పాతాళ శ్వేత వారాహి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా నడిగోటి రాము మాట్లాడుతూ, మొగుళ్లపల్లి మండల ప్రజలపై దేవుళ్ల కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజల జీవితాల్లో సుఖశాంతులు నెలకొని, కుటుంబాలు ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా రైతులు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని, ప్రతి కుటుంబం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కోరుకున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి నిరుపేద లబ్ధిదారునికి చేరాలని, తెలంగాణ అభివృద్ధి పథంలో మరింత వేగంగా ముందుకు సాగాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆశీస్సులతో మొగుళ్లపల్లి మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

దేవుళ్ల అనుగ్రహంతో ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పిల్లాపాపలతో, కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన జీవితం గడపాలని నడిగోటి రాము కోరారు. ఆధ్యాత్మిక యాత్ర ద్వారా ప్రజల సంక్షేమం కోసం ప్రార్థనలు చేయడం విశేషమని స్థానికులు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో మొగుళ్లపల్లి రిపోర్టర్ వడ్లకొండ పవన్ గౌడ్, పుట్ట అజయ్, బత్తిని రాజు గౌడ్, సూర్నేని మణికర్, బూర ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE