ఘోరం..10 వెహికిల్స్ ఒకదానికొకటి ఢీ

Published on

-Advertisement-

ఎన్‌హెచ్-44పై ఘోర రోడ్డు ప్రమాదం
లారీ టైరు పేలడంతో 10 వాహనాలు ఒకదానికొకటి ఢీ.. పలువురికి తీవ్ర గాయాలు

మన భారత్, నిజామాబాద్:
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని చంద్రన్‌పల్లి సమీపంలో జాతీయ రహదారి-44పై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ టైరు ఒక్కసారిగా పేలి వాహనం సడన్‌గా ఆగిపోవడంతో వెనుక నుంచి వస్తున్న వాహనాలు వరుసగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మొత్తం 7 కార్లు, 3 లారీలు పరస్పరం ఢీకొని భారీ నష్టం వాటిల్లింది.

స్థానికుల సమాచారం ప్రకారం, ఎన్‌హెచ్-44పై వేగంగా వెళ్తున్న ఓ లారీ టైరు తీవ్ర ఎండల కారణంగా పేలిపోయి రహదారిపైనే ఒక్కసారిగా నిలిచిపోయింది. దీంతో వెనుక నుంచి వస్తున్న వాహనాలు నియంత్రణ కోల్పోయి వరుసగా ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు పలు కార్లు పూర్తిగా ధ్వంసమై రోడ్డు పక్కకు వెళ్లిపడగా, కొన్ని లారీలు కూడా దెబ్బతిన్నాయి. ఘటనాస్థలంలో వాహనాల శకలాలు చెల్లాచెదురుగా కనిపించాయి.

ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. స్థానికులు, హైవే సిబ్బంది వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు.

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గురైన వాహనాలను రహదారి నుంచి తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించే చర్యలు చేపట్టారు. కొంతసేపు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

తీవ్ర ఎండల నేపథ్యంలో వాహనాల టైర్లు అధిక వేడికి గురై పేలిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘదూర ప్రయాణాలకు ముందు టైర్ల పరిస్థితి, వాటిలో ఎయిర్ ప్రెజర్ తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని సూచిస్తున్నారు. అప్రమత్తంగా ప్రయాణించడం ద్వారా ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ప్రధాని నరేంద్ర మోదీ దీర్ఘాయుష్షు, దేశాభివృద్ధి కోసం ప్రార్థనలు కార్యక్రమానికి హాజరుకానున్న ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్...

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: సర్పంచ్ చంటి

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో గ్రామస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: సర్పంచ్ ఏలుగు రాజన్న మన భారత్, తలమడుగు: ప్రజా...

సిక్కోలు అభివృద్ధికి ఎంఎస్ఎంఈ పార్కులు కీలకం

యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పరిశ్రమల విస్తరణ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయి: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మన భారత్,...

బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే

గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సభ్యత్వ నమోదులో ప్రతి కార్యకర్త...

More like this