e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

జర్నలిస్టుల ఐక్యతతోనే హక్కుల పరిరక్షణ..

శృంగవరపుకోటలో ఎపియూడబ్ల్యూజె నియోజకవర్గ స్థాయి సమావేశం ఘనంగా నిర్వహణ

మన భారత్, శృంగవరపుకోట:

జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం ఐక్యతతో ముందుకు సాగాలని ఎపియూడబ్ల్యూజె (APUWJ) నాయకులు పిలుపునిచ్చారు. శృంగవరపుకోట పట్టణ కేంద్రంలోని సుబ్బిరామిరెడ్డి కళ్యాణ మండపంలో ఎపియూడబ్ల్యూజె నియోజకవర్గ స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అడహక్ కమిటీ అధ్యక్షుడు, కో-చైర్మన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అడహక్ కమిటీ చైర్మన్ ఎలిశెట్టి సురేష్, కో-చైర్మన్ వి.ఎం. పాత్రో, స్టేట్ కమిటీ సభ్యులు టి. రాధాకృష్ణ మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సభ్యత్వ బలం కలిగిన జర్నలిస్టు సంఘంగా APUWJ ప్రత్యేక గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం యూనియన్ ఎన్నో పోరాటాలు నిర్వహించిన చరిత్ర ఉందని గుర్తు చేశారు.

జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిల్లో జర్నలిస్టులు ఐక్యంగా ఉంటూ యూనియన్ బలోపేతానికి కృషి చేయాలని నాయకులు సూచించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను సమిష్టిగా ఎదుర్కొని హక్కుల కోసం నిలబడాలని పిలుపునిచ్చారు.

రానున్న జూన్, జూలై నెలల్లో జిల్లా స్థాయి సమావేశాలను నిర్వహించనున్నట్లు నాయకులు వెల్లడించారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి యూనియన్‌ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. జర్నలిస్టుల సంఘటిత శక్తితోనే సమస్యలకు పరిష్కారం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.

ఈ సమావేశంలో స్టేట్ కమిటీ సభ్యుడు సన్యాసిరావు, జిల్లా అడహక్ కమిటీ సభ్యులు కొత్తవలస శివ, ఆరిపాక రాము, అల్లు యుగంధర్, రమణ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎస్.కోట, ఎల్.కోట, వేపాడ, కొత్తవలస, జామి ప్రాంతాలకు చెందిన పత్రిక ఎడిటర్లు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు.

జర్నలిస్టుల సమస్యలపై చర్చించడంతో పాటు యూనియన్ సభ్యత్వ విస్తరణ, సంఘ బలోపేతంపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు నాయకులు తెలిపారు. జర్నలిస్టుల ఐక్యతతోనే వృత్తి పరిరక్షణ, సంక్షేమం సాధ్యమవుతుందని వారు స్పష్టం చేశారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE