e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

కండక్టర్ ప్రవళిక మృతి ఆర్టీసీకి తీరని లోటు

కండక్టర్ ప్రవళిక మృతి ఆర్టీసీకి తీరని లోటు

బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం: టీజీఎస్ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి

హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు డిపోకు చెందిన మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల టీజీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (వీసీ అండ్ ఎండీ) వై. నాగిరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉండగా ప్రయాణికురాలి దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రవళిక మృతి చెందడం అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు.

ప్రవళిక మృతి వార్త తనను తీవ్రంగా కలచివేసిందని నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఆరోగ్యం క్రమంగా మెరుగుపడి, చికిత్స అనంతరం కోలుకుని తిరిగి విధుల్లో చేరుతారని ఆశించామని, కానీ ఇంతలోనే ఆమె మరణవార్త వినాల్సి రావడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. ప్రవళిక మరణం ఆర్టీసీ కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు.

ఉద్యోగులు తమ విధులను సక్రమంగా నిర్వహిస్తున్న సమయంలో ఇలాంటి దాడులకు గురికావడం ఆందోళనకరమని ఎండీ అభిప్రాయపడ్డారు. ప్రజలకు రవాణా సేవలు అందించే ఆర్టీసీ సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా అవసరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ప్రవళిక మృతి విషయం తెలిసిన వెంటనే ఎండీ నాగిరెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన నిందితురాలిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, ఘటన తీవ్రతను దృష్టిలో ఉంచుకుని హత్య కేసు నమోదు చేయాలని సూచించారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు వేగవంతం చేయాలని కోరారు.

ఈ ఘటన ఆర్టీసీ ఉద్యోగుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఉద్యోగి ప్రాణాలు కోల్పోవడం సంస్థలోని సిబ్బందిని కలచివేసింది. ఉద్యోగులు భయం లేకుండా తమ విధులను నిర్వహించేలా భద్రతాపరమైన చర్యలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.

ఇదిలా ఉండగా, ప్రవళిక కుటుంబ సభ్యులకు టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం తరఫున నాగిరెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరారు. ప్రవళిక కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, సంస్థ తరఫున వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.

ఉద్యోగి కుటుంబానికి అండగా నిలవడం సంస్థ బాధ్యతగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రవళిక మృతి పట్ల ఆర్టీసీ యాజమాన్యం తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, ఆమె కుటుంబానికి అండగా ఉంటామని పునరుద్ఘాటించింది.

– మీ విశాల్ కుమార్ మన భారత్ చీఫ్ ఎడిటర్ న్యూఢిల్లీ 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE