e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, October 17, 2026

సీఎం చంద్రబాబు నివాసానికి ప్రధాని మోదీ

మన భారత్, హైదరాబాద్:
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆదివారం జూబ్లీహిల్స్‌లోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. ప్రధాని రాక సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఆత్మీయ స్వాగతం పలికారు.

ప్రధాని మోదీ స్వయంగా తమ నివాసానికి రావడం చంద్రబాబు కుటుంబానికి ప్రత్యేక సందర్భంగా మారిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధాని రాకను పురస్కరించుకుని నివాసం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. స్వాగతం నుంచి విందు వరకు అన్ని ఏర్పాట్లను మంత్రి నారా లోకేశ్ స్వయంగా పర్యవేక్షించినట్లు సమాచారం.

తెలుగు రాష్ట్రాల ఆతిథ్య సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక వంటకాలతో ప్రధానికి విందు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతీయ రుచులకు ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేక మెనూను సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ భేటీ రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రధాని మోదీ, చంద్రబాబు, లోకేశ్ సమావేశమైనప్పటికీ.. ప్రధాని స్వయంగా చంద్రబాబు నివాసానికి రావడం చర్చనీయాంశమైంది. కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల విస్తరణ వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

రాజకీయాలకు అతీతంగా ప్రధాని మోదీకి నారా లోకేశ్‌తో ప్రత్యేక అనుబంధం ఉందనే చర్చ కూడా మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో ఢిల్లీలో ప్రధాని మోదీ స్వయంగా లోకేశ్‌ను తన నివాసానికి ఆహ్వానించి దీర్ఘకాలం సమావేశమైన విషయం అప్పట్లో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ప్రధాని రాకపై సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఈ సమావేశాన్ని చారిత్రాత్మకంగా అభివర్ణిస్తున్నారు. తెలుగు సంప్రదాయ ఆతిథ్యంతో ప్రధానికి స్వాగతం పలికిన నారా కుటుంబం ఏర్పాట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ సమావేశం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE