ఆపరేషన్ చేస్తుండగా వైద్యుడికి గుండెపోటు..

Published on

-Advertisement-

మన భారత్, నిర్మల్:

నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన ప్రముఖ వైద్యుడు డా. సురేందర్ గుండెపోటుతో మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సేవాభావంతో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న సమయంలోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది.

డా. సురేందర్ నర్సాపూర్ (జి) ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తూ, భైంసా పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రిని కూడా నిర్వహిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం తన ప్రైవేట్ ఆసుపత్రిలో ఓ రోగికి శస్త్రచికిత్స నిర్వహిస్తుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు.

అనూహ్యంగా గుండెపోటుకు గురైన ఆయనను సిబ్బంది వెంటనే గమనించి అత్యవసరంగా నిర్మల్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యంత శ్రమతో చికిత్స అందించినప్పటికీ ఆయన ప్రాణాలు నిలుపలేకపోయారు.

డా. సురేందర్ మరణ వార్త తెలిసిన వెంటనే భైంసా మరియు పరిసర ప్రాంతాల్లో విషాద వాతావరణం నెలకొంది. ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ రోగులు, స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలందించే వైద్యుడిగా ఆయనకు మంచి పేరు ఉంది.

ఆయన మృతి వైద్య వర్గాల్లోనూ తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. సహచరులు, స్నేహితులు, స్థానిక ప్రజలు ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. సేవలందిస్తూ ప్రాణాలు కోల్పోవడం ఎంతో దురదృష్టకరమని అభిప్రాయపడుతున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

More like this