పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు జాగ్రత్త.!

Published on

-Advertisement-

మన భారత్, హెల్త్ డెస్క్:

పిల్లల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దగ్గు సిరప్‌లు, జలుబు మందుల వినియోగంపై కఠిన నియంత్రణలు అమలు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ చర్యలు ప్రారంభించింది.

కొత్త మార్గదర్శకాల ప్రకారం, రెండేళ్లలోపు పిల్లలకు దగ్గు సిరప్‌లు, జలుబు మందులను వైద్యులు సూచించకుండా నిషేధించాలని ప్రతిపాదిస్తున్నారు. అలాగే ఐదేళ్లలోపు పిల్లలకు ఈ తరహా మందులను వాడకూడదనే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణయం చిన్నారుల ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఇటీవల కల్తీ దగ్గు సిరప్‌ల వాడకం కారణంగా భారత్ సహా పలు దేశాల్లో చిన్నపిల్లల మరణాలు నమోదవడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఈ నేపథ్యంలో ఔషధాల నాణ్యత, వినియోగంపై కట్టుదిట్టమైన నియంత్రణలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ అంశంపై Indian Pharmacopoeia Commission (ఐపీసీ) డ్రాఫ్ట్ నిబంధనలు రూపొందించింది. వీటి ప్రకారం వైద్యులు, ఫార్మాసిస్టులు సురక్షితమైన ప్రిస్క్రిప్షన్ విధానాలను పాటించాల్సి ఉంటుంది. మందుల వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని, తల్లిదండ్రులు కూడా వైద్యుల సలహా లేకుండా పిల్లలకు మందులు ఇవ్వకూడదని సూచించారు.

ఈ నిబంధనలు అమల్లోకి వస్తే చిన్నారుల ఆరోగ్యానికి మరింత రక్షణ లభిస్తుందని, ప్రమాదకర పరిణామాలు తగ్గే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం – ఆత్మగౌరవ పోరాటానికి విజయ చిహ్నం

మన భారత్ , ఆదిలాబాద్:  తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష, దశాబ్దాల పోరాటాల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ...

రవితేజ కష్టం ఫలించింది..!

అగ్నివీర్ ఫలితాల్లో సత్తా చాటిన కౌఠ (బీ) గ్రామానికి చెందిన రవితేజ యువతకు ఆదర్శంగా నిలిచిన గ్రామీణ ప్రతిభ మన భారత్,...

నూతన గ్రామ కార్యదర్శి పశువైద్యాధికారికి సన్మానం

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించిన దేవాపూర్ గ్రామపంచాయతీ ఎంపీడబ్ల్యూఎస్ సిబ్బందికి సేఫ్టీ కిట్ల పంపిణీ – గ్రామ అభివృద్ధికి...

వ్యవసాయ బావిలో పడి పులి మృతి..

దుర్వాసన రావడంతో బయటపడిన ఘటన.. శవపరీక్ష అనంతరం ఖననం మన భారత్, మహారాష్ట్ర: మహారాష్ట్ర రాష్ట్రంలోని చంద్రపూర్ జిల్లా బ్రహ్మపురి...

More like this