e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, October 17, 2026

కూతురి శవంతో ఐదు నెలలు ఇంట్లోనే తండ్రి..

మన భారత్, ఉత్తర ప్రదేశ్: 

Meerutలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. రిటైర్డ్ క్లర్క్ ఉదయ్ భాను బిస్వాస్ (76) తన కూతురు ప్రియాంక బిస్వాస్ (30) మృతదేహాన్ని ఐదు నెలల పాటు ఇంట్లోనే ఉంచుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

పోలీసుల వివరాల ప్రకారం, ప్రియాంక బిస్వాస్ డిసెంబర్ 5న చివరిసారిగా కనిపించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఆమె మరణించిన తర్వాత కూడా తండ్రి ఉదయ్ భాను బిస్వాస్ మృతదేహాన్ని బయటకు తెలియకుండా ఇంట్లోనే ఉంచుకున్నాడు. దుర్వాసన రాకుండా ఉండేందుకు భారీగా పర్ఫ్యూమ్‌లను ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు.

శుక్రవారం (ఏప్రిల్ 10)న బంధువులకు అనుమానం కలగడంతో వారు ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా బెడ్‌పై దుప్పటి కప్పి ఉంచిన అస్థిపంజరాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన బయటపడింది.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన వెనుక కారణాలు ఏమిటి, మానసిక స్థితి ఏంటి వంటి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కుటుంబ సంబంధాలు, మానసిక ఆరోగ్యం వంటి అంశాలపై మళ్లీ చర్చకు దారితీసింది.


రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE