రేపు ప్రజావాణి రద్దు.!

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్

మంత్రి పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్‌లో సోమవారం ప్రజావాణి రద్దు

ఆదిలాబాద్, జూలై 19: ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 20వ తేదీ (సోమవారం) రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రకటించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

మంత్రుల జిల్లా పర్యటన సందర్భంగా వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, సమీక్ష సమావేశాలు, అధికారిక ఏర్పాట్లు నిర్వహించాల్సి ఉండటంతో జిల్లా యంత్రాంగం మొత్తం విధుల్లో నిమగ్నమై ఉండాల్సిన అవసరం ఏర్పడిందని కలెక్టర్ వెల్లడించారు. ఈ కారణంగానే ప్రతి వారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఒకరోజు పాటు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రజావాణి ద్వారా జిల్లాలోని ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక, భూ సంబంధిత, సంక్షేమ పథకాల సమస్యలను నేరుగా జిల్లా అధికారుల దృష్టికి తీసుకువచ్చే అవకాశం కల్పించబడుతుంది. అయితే ఈసారి మంత్రి పర్యటనలతో అధికారులు ఇతర అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి రావడంతో ప్రజావాణి రద్దు చేశారు.

మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ 

ఆదిలాబాద్ జిల్లాలో పని చేయుటకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

ఆ గ్రామానికి జిల్లా కలెక్టర్ పేరు..!

ఆ గ్రామానికి ఆదిలాబాద్ కలెక్టర్ పేరు ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 13: గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ...

ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు

ఎన్టీఆర్ చౌరస్తాలో ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు ఆదిలాబాద్, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో...

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

కప్పర్లలో కేమా సదానందం కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరామర్శ తాంసీ, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్...

532 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం..

ఎండు గంజాయి స్వాధీనం మొగుళ్లపల్లి, ఆగస్టు 13: అక్రమంగా ఎండు గంజాయిని తరలిస్తున్న యువకుడిని మొగుళ్లపల్లి పోలీసులు అరెస్టు చేసి,...

More like this