ఘనంగా అందెశ్రీ జయంతి..

Published on

-Advertisement-

జయ జయహే “తెలంగాణ” గీతంతో..తెలంగాణ ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నతమైన వ్యక్తి

అందెశ్రీ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన వేముల మహేందర్ గౌడ్

మన భారత్,మొగుళ్ళపల్లి:

జయ జయహే తెలంగాణ” గీతంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి, తన కలాన్ని ఉద్యమ జెండాగా మలిచి తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన ప్రజాకవి అందెశ్రీ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ నేల ఆత్మను, ప్రజల ఆకాంక్షలను, ఉద్యమ స్పూర్తిని అక్షరాల్లో ఆవిష్కరించిన అరుదైన కవి అందెశ్రీ అని మహేందర్ గౌడ్ కొనియాడారు. ఆయన కలం నుంచి జాలువారిన ప్రతి పదం తెలంగాణ ఉద్యమ చరిత్రలో చెరగని ముద్రగా నిలిచిందని, ప్రతి గేయం ప్రజల హృదయాల్లో ఆత్మగౌరవ జ్యోతిని వెలిగించిందని పేర్కొన్నారు. అందెశ్రీ సాహిత్యం కేవలం కవిత్వం మాత్రమే కాదని, అది తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా, స్వాభిమానానికి స్వరంగా, భావితరాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిందన్నారు. తెలంగాణ పట్ల ఆయనకున్న అచంచలమైన అంకితభావం, ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత, సమాజానికి ఆయన అందించిన సాహిత్య సంపద చిరకాలం మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు. తెలంగాణ చరిత్ర ఉన్నంతకాలం ప్రజాకవి అందెశ్రీ పేరు, ఆయన సాహిత్యం, ఆయన ప్రబోధించిన ఆత్మగౌరవ సందేశం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి, తరతరాలను చైతన్యపరుస్తూనే ఉంటాయన్నారు.

మీ పవన్ కళ్యాణ్ రిపోర్టర్ మన భారత్..

మన భారత్ లో పని చేయుటకు జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గ, మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

అనుమతులు లేకుండా కల్తీ కల్లు విక్రయం.. 

ఒకరికి రూ.50 వేలు.. మరొకరికి రూ.10 వేల జరిమానా బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న తలమడుగు ఎస్‌ఐ...

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్‌దే అధికారం: కృష్ణ రత్న ప్రకాష్

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. బీఆర్ఎస్‌కు మద్దతు పెరుగుతోంది తాంసి నుంచి బోథ్ ధర్నాకు భారీగా తరలివెళ్లిన బీఆర్ఎస్...

19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు పైగా కొల్లగొట్టిన అంతర్రాష్ట్ర నేరగాడు అరెస్ట్

ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్ పేరుతో భారీ సైబర్ మోసం 19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు...

ఆ నలుగురు అరెస్ట్.!

గుప్త నిధుల పేరుతో మోసానికి యత్నం.. నలుగురు అరెస్ట్ ఉట్నూర్ కోటలో తవ్వకాలకు ప్రయత్నం.. వీడియోలతో ప్రజలను నమ్మించే యత్నం 4...

More like this