e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, October 18, 2026

బాధిత కుటుంబాలకు పరామార్శ..

మన భారత్, మొగుళ్ళపల్లి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో రైతు విమోచన కమిషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వరరావు (నవత వెంకన్న) సోమవారం విస్తృతంగా పర్యటించారు.

ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి, వారికి ఓదార్పునిచ్చారు. ముల్కలపల్లి గ్రామానికి చెందిన ఓనపాకల బిక్షపతి, పసునూటి ఓదెలు, చింతలపల్లి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ కుమ్మరి సారయ్యలు అనారోగ్యంతో మరణించగా, వారి కుటుంబ సభ్యులను నవత వెంకన్న పరామర్శించి సానుభూతి తెలిపారు.

బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఆయన, ఎలాంటి సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

అదేవిధంగా ఇటీవల అనారోగ్యంతో చికిత్స పొందిన చింతలపల్లి గ్రామానికి చెందిన కొడిమాల సమ్మయ్య ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ పర్యటనలో చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొడారి రమేష్ యాదవ్, సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి, చింతలపల్లి సర్పంచ్ కుమ్మరి నరేష్, ఉపసర్పంచ్ నేర్పటి శ్రీను, బీఆర్ఎస్ నాయకులు పసుల తిరుపతి, దార్ల ఆనంద్, లడే మహిపాల్, జన్నే కమలాకర్, జన్నే మొగిలి, వెంకటస్వామి, అంగిడి రమేష్, దార్ల శ్రీను, జన్నే సదయ్య, రాజేష్, ప్రభు తదితరులు పాల్గొన్నారు.

రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/


మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE