e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

‘నేను సంపాదిస్తాను… నువ్వు క్రికెట్ ఆడు’ – వరుణ్ చక్రవర్తి లవ్ స్టోరీ వెనుక త్యాగగాథ

మన భారత్, తెలంగాణ:

టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి విజయగాథ వెనుక ఆయన భార్య నేహా ఖేడేకర్ త్యాగం, ప్రోత్సాహం కీలక పాత్ర పోషించాయి. వీరిద్దరి ప్రేమకథ తమిళనాడులోని SRM Institute of Science and Technology (SRM యూనివర్సిటీ)లో చదువుకునే రోజుల్లో ప్రారంభమైంది.

ఆర్కిటెక్ట్‌గా మంచి ఉద్యోగం చేస్తున్న వరుణ్, తన కల అయిన క్రికెట్ వైపు పూర్తిగా మళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. ఆ సమయంలో నేహా ఇచ్చిన ధైర్యం ఆయన కెరీర్‌కు మలుపుతిప్పింది. “నీకు జాబ్ లేకపోయినా ఫర్వాలేదు. నేను సంపాదిస్తాను. నువ్వు క్రికెట్ ఆడు” అని ఆమె చెప్పిన మాటలు వరుణ్ జీవితాన్ని మార్చేశాయి.

క్రికెట్‌లో స్థిరపడతానో లేదో తెలియక, తనను పెళ్లి చేసుకోవద్దని వరుణ్ చెప్పినా నేహా వెనుకడుగు వేయలేదట. అతని ప్రతిభపై పూర్తి నమ్మకం ఉంచి, అన్ని కష్టకాలాల్లో అండగా నిలిచారు. ఆ మద్దతే వరుణ్‌ను ఐపీఎల్ నుంచి టీమిండియా వరకు తీసుకెళ్లిందని సన్నిహితులు చెబుతున్నారు.

కలల కోసం రిస్క్ తీసుకున్న యువకుడికి, ఆ కల నెరవేర్చేందుకు వెన్నంటి నిలిచిన భాగస్వామి కథగా ఈ లవ్ స్టోరీ నిలిచిపోయింది. విజయానికి వెనుక ఉన్న కుటుంబ మద్దతు ఎంత ముఖ్యమో వరుణ్–నేహా జంట ఉదాహరణగా నిలుస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE