కవిత కొత్త పార్టీకి ‘తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ’ పేరు.?

Published on

-Advertisement-

మన భారత్, తెలంగాణ:

ఈ ఏడాది మేలో కొత్త రాజకీయ పార్టీ స్థాపనపై ప్రకటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పార్టీ పేరుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. మే మొదటి వారంలో శుభ ముహూర్తం చూసుకుని పార్టీ పేరును అధికారికంగా ప్రకటిస్తామని, పేరులో ‘తెలంగాణ’ పదం తప్పనిసరిగా ఉంటుందని ఆమె ముందుగానే సంకేతాలు ఇచ్చారు.

ఇప్పటికే పార్టీ పేరును  తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ (TPJP)గా నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం వెలువడుతోంది. అయితే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సి ఉంది. కొత్త పార్టీ ద్వారా తెలంగాణ స్వాభిమానం, సామాజిక న్యాయం, యువత–మహిళల సాధికారతకు ప్రాధాన్యం ఇవ్వాలని కవిత లక్ష్యంగా పెట్టుకున్నట్లు అనుచర వర్గాలు చెబుతున్నాయి.

పార్టీ జెండా రంగులపై కూడా చర్చ సాగుతోంది. పసుపు, ఎరుపు రంగులతో జెండాను రూపొందిస్తున్నట్లు సమాచారం. పసుపు అభివృద్ధి, ఆశయాలను సూచిస్తే, ఎరుపు పోరాట స్పూర్తిని ప్రతిబింబిస్తుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

పార్టీ గుర్తుపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ‘కాగడా’ లేదా ‘కళ్లజోడు’ గుర్తులపై దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఎన్నికల సంఘం అనుమతి అనంతరం మాత్రమే అధికారిక గుర్తు ఖరారవుతుంది.

కొత్త పార్టీ ఆవిర్భావంతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో కవిత అనుచరులు కార్యాచరణకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం.

Latest articles

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

More like this