e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, October 17, 2026

పంచాయతీలకు రూ.250 కోట్లు విడుదల.. గ్రామీణాభివృద్ధికి ఊతం

మన భారత్, హైదరాబాద్:

తెలంగాణలో గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల అభివృద్ధి పనుల కోసం దాదాపు రూ.250 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులతో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులను చెల్లించనున్నారు.

అదేవిధంగా గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, రోడ్ల మరమ్మతులు, వీధి దీపాలు, ఇతర మౌలిక సదుపాయాల మెరుగుదలకు ఈ నిధులను వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. నిధుల విడుదలతో గ్రామీణ ప్రాంతాల్లో నిలిచిపోయిన అభివృద్ధి పనులు వేగవంతం కానున్నాయి.

ఇటీవలే 15వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి రూ.387 కోట్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ నిధులు కూడా పంచాయతీల అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించబడనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ దశలవారీగా నిధులు కేటాయిస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

గ్రామ పంచాయతీ స్థాయిలో మౌలిక వసతులు మెరుగుపడితే గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE