బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలో వర్షాలు

Published on

-Advertisement-

బంగాళాఖాతంలో బలహీనపడిన వాయుగుండం.. ఏపీలో వర్షాలు

మన భారత్, ఆంధ్రప్రదేశ్: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం క్రమంగా బలహీనపడింది. శనివారం శ్రీలంకలోని ముల్లయిట్టివు సమీపంలో తీరం దాటిన వాయుగుండం ప్రస్తుతం ముల్లయిట్టివుకు సుమారు 30 కిలోమీటర్లు, చెన్నైకి 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఆదివారం నాటికి ఇది మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.

ఈ వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాల్లో ఆదివారం నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు తమిళనాడు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. సముద్ర తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రానికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

వచ్చే మూడు రోజులు తీవ్ర చలి.. హెచ్చరికలు జారీ

తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరుగుతోంది. పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు తీవ్ర చలి కొనసాగే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.

తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్న దిగువ స్థాయి గాలుల ప్రభావంతో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్యనే నమోదయ్యే అవకాశముందని తెలిపారు. ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో చలి తీవ్రంగా ఉండనుందని, వృద్ధులు, చిన్నపిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవసరమైతే వేడి దుస్తులు ధరించాలని, చలి సంబంధిత వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.

Latest articles

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

More like this