జామిడి సర్పంచ్ ఈరగొల్ల అశోక్ ను సన్మానించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే

Published on

-Advertisement-

తెలంగాణ భవన్‌లో బోథ్ సర్పంచ్‌లకు ఘన సన్మానం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో సోమవారం బోథ్ నియోజకవర్గ సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై, పార్టీ తరఫున ఎన్నికైన నూతన ప్రజాప్రతినిధులను అభినందించారు.

ఈ సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌తో కలిసి, జామిడి గ్రామానికి నూతనంగా సర్పంచ్‌గా ఎన్నికైన బీఆర్ఎస్ నాయకుడు ఈరగొల్ల అశోక్‌ను కేటీఆర్ ప్రత్యేకంగా ఘనంగా సత్కరించారు. గ్రామస్థాయి నుంచి పార్టీకి ప్రజలు ఇచ్చిన విశ్వాసం ప్రశంసనీయమని పేర్కొన్న ఆయన, అదే నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ముందుండాలని సూచించారు.

గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలని, ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పాలనలో పారదర్శకతను కాపాడాలని కేటీఆర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సాధించిన విజయాలు కార్యకర్తల కష్టఫలితమని పేర్కొంటూ, భవిష్యత్తులోనూ పార్టీని మరింత బలోపేతం చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తుల శ్రీనివాస్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Latest articles

రేపు ప్రజావాణి రద్దు.!

మన భారత్, ఆదిలాబాద్ మంత్రి పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్‌లో సోమవారం ప్రజావాణి రద్దు ఆదిలాబాద్, జూలై 19: ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో...

నకిలీ ఫోన్‌పేతో రూ.7,610 మోసం.. ఇద్దరు నిందితులు అరెస్ట్

నకిలీ ఫోన్‌పేతో రూ.7,610 మోసం.. ఇద్దరు నిందితులు అరెస్ట్ మూడు నూనె డబ్బాలు కొనుగోలు చేసి నకిలీ చెల్లింపు.. దొంగ...

20 న మంత్రి జూపల్లి రాక..

ఎల్నినో ప్రభావంపై అప్రమత్తం.. జూలై 20న ఉట్నూరులో మంత్రి జూపల్లి పర్యటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు, ప్రత్యామ్నాయ...

ఘనంగా అందెశ్రీ జయంతి..

జయ జయహే "తెలంగాణ" గీతంతో..తెలంగాణ ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నతమైన వ్యక్తి అందెశ్రీ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన వేముల...

More like this