e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, October 18, 2026

ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రూ.40 లక్షలు..

ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామానికి 40 లక్షలు ఇస్తా: బాల్డ్ యాదగిరి

మన భారత్, రాజాపేట: రాజాపేట మండలం బొందుగుల గ్రామంలో ఎన్నికల వేడి మొదలైన నేపథ్యంలో సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వచ్చిన బాల్డ్ యాదగిరి కీలక ప్రకటన చేశారు. తాను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధి కోసం తన వ్యక్తిగత నిధుల నుంచి ₹40 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తానని ఆయన ప్రకటించారు.

తనకు నలుగురు సంతానం ఉన్నప్పటికీ ప్రస్తుత సర్పంచ్ నిబంధనలు తనకు అనుకూలంగా ఉండటంతో ప్రజాసేవ కోసం ముందుకు వస్తున్నట్లు యాదగిరి తెలిపారు. గ్రామ అభివృద్ధి పట్ల తనకున్న కట్టుబాటు వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

అన్ని పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు తన విన్నపాన్ని పరిగణలోకి తీసుకుని ఏకగ్రీవానికి సహకరించాలని కోరుతున్నట్లు యాదగిరి చెప్పారు. గ్రామం మొత్తం అభివృద్ధి దిశగా తీసుకోబోయే సంకల్పాలకు ప్రజలు స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE