పనులు నిలిచిపోయాయి పరేషాన్..

Published on

-Advertisement-

నర్సాపూర్ వెజ్-నాన్ వెజ్ మార్కెట్ పనులు నిలిచిపోయి ఇబ్బందులు — వెంటనే పూర్తి చేయాలని వ్యాపారుల విజ్ఞప్తి

మన భారత్, మెదక్ జిల్లా నర్సాపూర్:
నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణంలో ఉన్న వెజ్-నాన్ వెజ్ మార్కెట్ పనులు మధ్యలో ఆగిపోవడంతో వ్యాపారులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మార్కెట్ యార్డ్ నిర్మాణం ఆగిపోవడంతో ప్రాంతం చెత్తతో నిండిపోయి దుర్వాసన వ్యాపిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మున్సిపాలిటీ పరిధిలో ప్రతి మంగళవారం, శుక్రవారం సంతలు జరుగుతాయి. ఈ సందర్భంగా కూరగాయలు, మాంసం, చేపలు, గుడ్లు వంటి వస్తువులు విక్రయించే వ్యాపారులు తాత్కాలికంగా రోడ్డు పక్కన కూర్చొని అమ్మకాలు చేస్తున్నారు. చెత్త పేరుకుపోవడం వల్ల వ్యాపార వాతావరణం దెబ్బతిందని వారు పేర్కొన్నారు.

స్థానికుల ప్రకారం, పలుమార్లు అధికారులు, ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. “ప్రతిసారి మంత్రులు, అధికారులు వస్తున్నా ఈ మార్కెట్ పనులు ఎవరూ పట్టించుకోవడం లేదు,” అని వ్యాపారులు అసహనం వ్యక్తం చేశారు.

ప్రజలు, వ్యాపారులు కలిసి మీడియా ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ — వెంటనే నిలిచిపోయిన వెజ్-నాన్ వెజ్ మార్కెట్ యార్డ్ పనులను పూర్తి చేసి, శుభ్రమైన, సదుపాయాలతో కూడిన మార్కెట్‌ను అందించాలని కోరుతున్నారు.

మార్కెట్ పూర్తయితే వ్యాపారులకు సౌకర్యం, వినియోగదారులకు పరిశుభ్రమైన వాతావరణం లభిస్తుందని స్థానికులు తెలిపారు.

Latest articles

టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా బానోత్ వసంత్‌ రావు..

నేరడిగొండ మండల బాధ్యుడిగా బానోత్ వసంత్‌రావు.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా రాథోడ్ బాపూరావు...

అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి

గ్రామస్థాయి నుండి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి మన భారత్, మొగుళ్ళపల్లి: మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత,...

విడుదలైన నీట్ ఫలితాలు..

విడుదలైన నీట్ ఫలితాలు -ప్రభంజనం సృష్టించిన మోషన్ కాలేజీ విద్యార్థులు విద్యార్థులను అభినందించిన మోషన్ కాలేజ్ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మన...

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...

More like this