e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Thursday, November 26, 2026

డాక్టర్ భోగ శ్రావణి గారిపై వ్యక్తిగత దూషణలు చేస్తే సహించేది లేదు

డాక్టర్ భోగ శ్రావణి గారిపై వ్యక్తిగత దూషణలు చేస్తే సహించేది లేదు
– కాంగ్రెస్ జిల్లా జిల్లా అధ్యక్షుల పైన ఉన్న రౌడీ షీట్ ఎందుకు తీసివేయడం జరిగింది
– గతంలో రౌడీషీట్ ఉన్నది నిజమా కాదా…? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ రౌడీ షీట్ ఎలా తొలగిపోయింది
– మహిళా నాయకురాలు అని కూడా చూడకుండా రాజకీయం చేస్తున్నారా రౌడీయిజం చేస్తున్నారా….?
– రాజకీయ విమర్శలకు సమాధానం రాజకీయంగానే చెబుతాం
– మహిళా నాయకురాళ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోం..
ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నారపాక అశోక్

జగిత్యాల, నవంబర్ 26, మన భారత్ :
గాజంగి నందయ్య మీ రాజకీయ ప్రయాణం, గతంలో మీరు మార్చుకున్న రాజకీయ వైఖరిపై జగిత్యాల ప్రజలకు సమాధానం చెప్పండి! ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మహిళా నాయకురాళ్లపై జరుగుతున్న వ్యక్తిగత విమర్శల విషయంలో మీ వైఖరి ఏమిటి? భారతీయ జనతా పార్టీ జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ భోగ శ్రావణి గారిపై కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య ఇటీవల నిర్వహించిన పత్రికా సమావేశంలో చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు, అనుచిత విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ ఎస్సీ మోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షుడు నారపాక అశోక్ అన్నారు.

గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ జిల్లా నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డాక్టర్ భోగ శ్రావణి రాజకీయాల్లో స్వతంత్రంగా ఎదుగుతూ ప్రజల కోసం పనిచేస్తున్న మహిళా నాయకురాలు. ఆమె రాజకీయ నిర్ణయాలను, విధానాలను విమర్శించే హక్కు ఎవరికైనా ఉంటుంది. కానీ రాజకీయ విమర్శల పేరుతో వ్యక్తిగత దూషణలకు దిగడం, ఒక మహిళా నాయకురాలి గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడటం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. గాజంగి నందయ్య రాజకీయాలు చేయండి కానీ వ్యక్తిగత దూషణలు చేయకండి! మీరు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు.

ఆ పదవికి ఒక గౌరవం, బాధ్యత ఉంటాయి. ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన మీరు మహిళా నాయకురాళ్ల వ్యక్తిగత జీవితాలపై వ్యాఖ్యలు చేయడం ఏ రాజకీయ సంస్కృతికి నిదర్శనం? జగిత్యాల జిల్లా ప్రజలకు మీ గత రాజకీయ ప్రయాణం గురించి అనేక విషయాలు తెలుసు. ఒకప్పుడు జీవన్ రెడ్డి గారితో కలిసి రాజకీయాల్లో పనిచేసిన మీరు, రాజకీయ విభేదాల సమయంలో ఆయనపై తీవ్ర విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయని ప్రజలకు తెలుసు. అనంతరం రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మీ వైఖరిని మార్చుకుంటూ వివిధ రాజకీయ నాయకులతో కలిసి పనిచేస్తున్నారు.

గతంలో కోదండ రామాలయ భూముల వ్యవహారంలో ప్రస్తుత మున్సిపల్ చెర్మన్ సమిండ్ల వాణి భర్త సమిండ్ల శ్రీనివాస్ భూ కబ్జా చేసాడని జీవన్ రెడ్డితో కలిసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న మీరు ప్రస్తుతం వారితోనే చెట్టపట్టాలు వేసుకొని తిరగడాన్ని జగిత్యాల జిల్లా ప్రజలు గమనిస్తున్నారు, కందన్ గురించి మాట్లాడే మీరు ఆ వ్యవహారంపై మీ వైఖరి ఏమిటో ప్రజలకు స్పష్టం చేయాలి. మీ రాజకీయ ప్రయాణంలో మీరు తీసుకున్న వైఖరులు, చేసిన విమర్శలు, ప్రస్తుతం మీరు అనుసరిస్తున్న రాజకీయ విధానాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మీకు కొన్ని సూటి ప్రశ్నలు! గాజంగి నందయ్య నిన్నటి సమావేశంలో మిమ్మల్ని గొప్ప నాయకుడిగా అభివర్ణించారు.

అయితే జగిత్యాల ప్రజలకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో డాక్టర్ సంజయ్ కుమార్ గారి పాత్ర ఏమిటి?, 2014 వరకు టీఆర్ఎస్ పార్టీతో, తెలంగాణ ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేని మీకు జగిత్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం రావడానికి అప్పటి జగిత్యాల నియోజకవర్గ TRS పార్టీ ఉద్యమ నాయకుడు తాటిపర్తి శరత్ రెడ్డి కదా మీ సమాధానం చెప్పండి?, భోగ శ్రావణి బీజేపీ సభ్యత్వం తీసుకునే ముందే TRS పార్టీ తరుపున గెలిచినా కౌన్సిలర్, మరియు మున్సిపల్ చెర్మన్ పదవికి రాజీనామా చేసి బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు.

కానీ మీరు BRS పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి, మీ కుటుంబ సభ్యుల కాంట్రాక్టుల కోసం కాంగ్రెస్ పార్టీ తో అంటకాగుతున్నా మీ రాజకీయ వైఖరిపై ప్రజలకు ఏం సమాధానం చెబుతారు?, మహిళలు రాజకీయంగా ఎదుగుతున్నప్పుడు వారిపై వ్యక్తిగత విమర్శలు జరుగుతుంటే వాటిని ఖండించాల్సిన బాధ్యత మీకు లేదా?, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య మహిళా నాయకురాళ్లపై చేస్తున్న వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా? లేక గతంలో మీరు బీసీ మహిళా నాయకురాల్లు అయినా భోగ శ్రావణిపైనా, ఆడువల జ్యోతిపైనా, దావా వసంతపైనా చేసిన వ్యక్తిగత విమర్శలకు ఇది కొనసాగింపు అనుకోవాలా మహిళల గౌరవం విషయంలో రాజకీయాలకు అతీతంగా నిలబడాలి! మహిళలు రాజకీయాల్లోకి రావడం, నాయకత్వ బాధ్యతలు చేపట్టడం, ప్రజా సమస్యలపై పోరాడటం కొందరికి ఇబ్బందిగా మారకూడదు.

ఒక మహిళా నాయకురాలిని రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత విమర్శలకు దిగడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. కాంగ్రెస్ పార్టీలోని మహిళా నాయకురాళ్లతో పాటు ఇతర పార్టీల మహిళా నాయకురాళ్లపై కూడా అనుచిత వ్యాఖ్యలు జరుగుతున్నాయనే ఆరోపణలు మా దృష్టికి వచ్చాయి. ఈ వ్యవహారంపై సంబంధిత నాయకులు స్పష్టత ఇవ్వాలి. మహిళలపై ఎవరైనా అసభ్యకరమైన లేదా అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తే బాధితులు చట్టపరంగా ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలి. అలాంటి సందర్భాల్లో వారికి న్యాయం జరిగేలా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందన్నారు.

కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు కాశెట్టి తిరుపతి, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రిపల్లి సత్యం, ఎస్సీ మోర్చా జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శులు బన్న సంజీవ్, బీజేపీ జగిత్యాల పట్టణ ప్రధాన కార్యదర్శులు ఆముద రాజు, ఇట్యల రాము, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు దుబ్బ శ్రవణ్ కుమార్, జిల్లా కార్యదర్శులు గూనుకొండ నరేష్, బెత్తెపు నర్సయ్య, ఎస్సీ మోర్చా జగిత్యాల పట్టణ అధ్యక్షులు నక్క జీవన్ తదితర బీజేపీ, బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు పాల్గోన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE