e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Thursday, November 26, 2026

ఎంఎస్ఎఫ్ పెగడపల్లి మండల కమిటీ ఎన్నిక

ఎంఎస్ఎఫ్ పెగడపల్లి మండల కమిటీ ఎన్నిక
జగిత్యాల/పెగడపల్లి, నవంబర్ 26, మన భారత్ :
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల్ కేంద్రంలోని జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో ఎంఎస్ఎఫ్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నూతన కమిటీలను గురువారం ఎన్నుకోవడం జరిగింది. మారంపల్లి పద్మ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు, ధర్మపురి నియోజకవర్గ ఇంచార్జ్ బెజ్జంకి సతీష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నాయకులు ఆధ్వర్యంలో నూతన కమిటీలను ఎన్నుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మాదిగ విద్యార్థుల భవిష్యత్తు విద్యా ఉద్యోగ రంగాలలో మాదిగ జాతికి ముందు అసలు నిలబెట్టడంలో భాగంగా అదేవిధంగా మాదిగ జాతి భవిష్యత్తు కోసం మహనీయులు కలలుగన్న నూతన సమాజ నిర్మాణం కోసం గ్రామ, మండల, జిల్లాస్థాయి నూతన ఎమ్మార్పీఎస్ కమిటీలు, మండల కమిటీలు జిల్లా కమిటీ, అనుబంధ సంఘాలను ముఖ్యంగా మాదిగ విద్యార్థి విభాగాన్ని స్పెషల్ డ్రైవగా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి మండల జిల్లా నూతన మండల అధ్యక్షులు అందరు కలిసి మాదిగ విద్యార్థి విభాగాన్ని నూతన నిర్మాణం చేయడమే లక్ష్యంగా అన్న ఆదేశాలను అనుసరిస్తూ గురువారం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల్ జడ్పిహెచ్ఎస్ స్కూల్లో నూతన కమిటీలను ఎన్నుకోవడం జరిగింది.

కార్యక్రమం లో మహిళ విభాగం రాష్ట్ర నాయకురాలు శనిగరపు కాంతక్క మాదిగ, ఎలాగందుల నర్సవ్వ మాదిగ తదితరులు పాల్గొన్నారు. పురుషుల నుంచి అధ్యక్షులుగా బొమ్మేన మహేష్ మాదిగ, అధికార ప్రతినిధిగా బొమ్మేన రంజిత్ మాదిగ, ఉపాధ్యక్షులుగా బొమ్మేన ఈశ్వంత్, ప్రధాన కార్యదర్శిగా వేల్పుల దిక్షిత్, బైరి ఉజ్వల్, సహాయ కార్యదర్శిగా బొమ్మేన రిశ్వంత్, సంయుక్త కార్యదర్శిగా చిలుక సృజన్ కార్యదర్శిగా ఉపారపు కౌశిక్ కోశాధికారి, మహిళల నుంచి అధ్యక్షురాలుగా ఆత్మకూరి ఆరాధ్య మాదిగ, అధికార ప్రతినిధి గ తాండ్ర శ్రీజ మాదిగ, ఉపాధ్యక్షురాలుగా ఆత్మకూరి సిందూజ, ప్రధాన కార్యదర్శిగా కొత్తపెల్లి సంకీర్తన, ప్రధాన కార్యదర్శి తడగొండ అక్షర, అరెల్లి వందనలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE