e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Thursday, November 26, 2026

రైతుల సమస్యలపై గిమ్మ నుంచి యాదగిరిగుట్ట వరకు జరా ప్రశాంత్ పాదయాత్ర

రైతుల సమస్యలపై గిమ్మ నుంచి యాదగిరిగుట్ట వరకు జరా ప్రశాంత్ పాదయాత్ర

పాదయాత్రకు జెండా ఊపి ప్రారంభించిన మాజీ మంత్రి జోగు రామన్న

మన భారత్, బోరజ్: నవంబర్ 26,

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా, రైతుల సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో ఆదిలాబాద్ నియోజకవర్గంలోని గిమ్మ గ్రామానికి చెందిన యువకుడు జరా ప్రశాంత్ పాదయాత్ర చేపట్టారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని, జోగు రామన్న విజయమే లక్ష్యంగా ఈ పాదయాత్రను ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. గిమ్మ గ్రామం నుంచి యాదగిరిగుట్ట వరకు ఈ యాత్ర కొనసాగనుంది.

పాదయాత్ర ప్రారంభానికి ముందు గ్రామంలోని హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు జోగు రామన్న గిమ్మ గ్రామానికి చేరుకుని పాదయాత్రకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మంగళహారతులతో ఆయనకు స్వాగతం పలికారు. పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగం, రైతుల పట్ల అనుసరిస్తున్న విధానాలపై రైతాంగంలో అసంతృప్తి నెలకొందని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ పాలనలో రైతులతో పాటు సామాన్య ప్రజలు కూడా పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతుల ఇబ్బందులపై తన నిరసనను వ్యక్తం చేస్తూ జరా ప్రశాంత్ పాదయాత్ర చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు.

గిమ్మ గ్రామం నుంచి యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర చేపట్టాలనే జరా ప్రశాంత్ నిర్ణయం సాహసోపేతమైనదని, లక్ష్యం చేరుకునే వరకు ఆయనకు అండగా ఉంటామని జోగు రామన్న భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఈ పాదయాత్రకు మద్దతు తెలిపి ఆదరిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. పాదయాత్ర విజయవంతంగా పూర్తయ్యేలా సహకరిస్తామని, జరా ప్రశాంత్ కుటుంబ సభ్యులకు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున అండగా ఉంటామని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE