e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

ప్రజా సమస్యల పరిష్కారంపై మంత్రి జూపల్లి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో సాజిద్ ఖాన్ భేటీ

జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై మంత్రి జూపల్లి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో సాజిద్ ఖాన్ భేటీ

హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేతలు.. జిల్లా అభివృద్ధి, పార్టీ బలోపేతంపై చర్చ

మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 24:

ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రస్థాయి నేతలతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో నిన్న జరిగిన ముఖ్య సమావేశం సందర్భంగా ఆదిలాబాద్ మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ ఎంపీ సోయం బాపూరావు, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్ కలిసి జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును, రాజ్యసభ సభ్యుడు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులకు పుష్పగుచ్ఛాలు అందజేసి మర్యాదపూర్వకంగా అభివాదం చేశారు. అనంతరం ఆదిలాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, నియోజకవర్గాల వారీగా అభివృద్ధి కార్యక్రమాల పురోగతి వంటి అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

అలాగే జిల్లాలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మరింత చేరువ కావడం వంటి అంశాలపై చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ స్థాయిలో అవసరమైన సహకారం అందించాలని నాయకులు కోరినట్లు తెలిసింది.

ఈ భేటీ ద్వారా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి అంశాలతో పాటు పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కూడా నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE