e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు..

తలమడుగులో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
దివ్యాంగ చిన్నారులకు ఆటల పోటీలు.. విజేతలకు బహుమతుల ప్రదానం

మన భారత్, తలమడుగు: నవంబర్ 18, బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తలమడుగు మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నైబర్‌హుడ్ సెంటర్‌లో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులతో పాటు దివ్యాంగ పిల్లల్లో ఉత్సాహాన్ని నింపేలా వివిధ రకాల ఆటల పోటీలను ఏర్పాటు చేశారు.

డీఆర్డీఏ డీపీఎం రామకాంత, ఏపీఎం శేఖర్, మండల సమాఖ్య అధ్యక్షురాలు సాంబయి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలకు నైబర్‌హుడ్ సెంటర్ సిబ్బంది, సీబీఆర్ వర్కర్లు, మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన దివ్యాంగ చిన్నారులు, వారి తల్లిదండ్రులు, ఇతర బాలబాలికలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా చిన్నారులకు నిర్వహించిన ఆటల పోటీల్లో పిల్లలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. పోటీల్లో విజయం సాధించిన చిన్నారులకు డీపీఎం రామకాంత, ఏపీఎం శేఖర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. పిల్లలను ప్రోత్సహించడం, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, దివ్యాంగ చిన్నారులకు సమాన అవకాశాలు కల్పించడం ఇటువంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు.

బాలల దినోత్సవ వేడుకలతో చిన్నారుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ నర్సింహులు, సీసీలు స్వామి, సురేష్ రెడ్డి, సుజాత తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE