e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, November 25, 2026

30 ఏళ్ల గల్లీ రోడ్డు సమస్యకు పరిష్కారం.. శాంతినగర్‌లో సీసీ రోడ్డు నిర్మాణం

 

30 ఏళ్ల గల్లీ రోడ్డు సమస్యకు పరిష్కారం.. శాంతినగర్‌లో సీసీ రోడ్డు నిర్మాణం

కౌన్సిలర్ సూచిక మనోజ్ కుమార్ చొరవతో మారిన రోడ్డు రూపురేఖలు.. స్థానికుల హర్షం

మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 17, ఏళ్ల తరబడి అపరిశుభ్రత, చెత్తాచెదారం, మురుగునీటితో నిండిపోయి ప్రజల రాకపోకలకు ఇబ్బందికరంగా మారిన గల్లీ రోడ్డుకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్ కాలనీలో సుమారు 30 సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోని రహదారి సమస్యకు ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా విజయం సాధించిన సూచిక మనోజ్ కుమార్ చొరవతో పరిష్కారం లభించింది.

శాంతినగర్ కాలనీలోని ఓ గల్లీ రోడ్డు గత మూడు దశాబ్దాలుగా తీవ్ర అపరిశుభ్రతకు నిలయంగా ఉండేది. రహదారి మొత్తం చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాటు మురుగునీరు నిలిచిపోయి ప్రజలు అటువైపు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు పడేవారు. ముఖ్యంగా వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారి స్థానికులకు రాకపోకలు కష్టతరమయ్యేవి.

ఇటీవల కౌన్సిలర్‌గా ఎన్నికైన సూచిక మనోజ్ కుమార్ ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించారు. వెంటనే పారిశుద్ధ్య పనులు చేపట్టి గల్లీ రోడ్డులో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేయించారు. అనంతరం రాకపోకలకు అనువుగా సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడంతో ఆ గల్లీ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.

గతంలో అపరిశుభ్రంగా, మురుగునీటితో నిండిపోయిన రహదారి ప్రస్తుతం శుభ్రంగా, సుందరంగా కనిపిస్తోంది. సమస్యను గుర్తించిన వెంటనే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవడంపై కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు స్థానిక సమస్యలపై దృష్టి సారిస్తే దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఈ ఘటన మరోసారి చాటిచెబుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE