e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, November 25, 2026

అక్రమ దందా.. ముగ్గురు అరెస్ట్

అక్రమంగా గుట్ట మట్టి తవ్వకాలు.. ముగ్గురు అరెస్ట్

జేసీబీ, టిప్పర్ వాహనాలు స్వాధీనం.. నిందితులకు రిమాండ్

మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 17: ప్రభుత్వ అనుమతులు లేకుండా గుట్ట మట్టి, రాళ్లను అక్రమంగా తవ్వి తరలించేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను మావల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అక్రమ తవ్వకాలకు ఉపయోగించిన జేసీబీ, టిప్పర్ వాహనాలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మావల మండల పరిధిలోని మావల గ్రామ శివారులో చోటుచేసుకుంది.

మావల ఎస్‌హెచ్‌ఓ బి.డి. ప్రేమ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 15వ తేదీ సాయంత్రం సుమారు 5:30 గంటల సమయంలో పోలీసు సిబ్బందితో కలిసి గ్రామ శివారులో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ చిన్న గుట్ట సమీపంలో జేసీబీ, టిప్పర్ వాహనాలు నిలిపి ఉండటాన్ని పోలీసులు గమనించారు. అక్కడ కొందరు వ్యక్తులు గుట్ట నుంచి మట్టిని తవ్వి టిప్పర్‌లో లోడ్ చేస్తుండటంతో వెంటనే అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు.

పోలీసుల విచారణలో పాంధేన సతీష్, మోసిన్ ఖాన్, షేక్ నవీద్ అనే ముగ్గురు వ్యక్తులు మట్టి తవ్వకాలు చేపడుతున్నట్లు గుర్తించారు. తవ్వకాలకు సంబంధించి ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని, మట్టిని తరలించేందుకు చెల్లుబాటు అయ్యే పత్రాలు కూడా తమ వద్ద లేవని వారు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.

దీంతో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని, అక్రమ తవ్వకాలకు ఉపయోగించిన జేసీబీ, టిప్పర్ వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై మావల పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 772/2026గా కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ సెక్షన్ 303(2), పీడీపీపీ యాక్ట్ సెక్షన్ 3 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను నవంబర్ 15న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.

అరెస్టయిన నిందితుల వివరాలు

పాంధేన సతీష్ (37): తండ్రి గంగారెడ్డి, మావల గ్రామం, మండలం, ఆదిలాబాద్ జిల్లా.

మోసిన్ ఖాన్ (34): తండ్రి ఖాజా మొయినుద్దీన్ ఖాన్, ద్వారకానగర్, ఆదిలాబాద్.

షేక్ నవీద్ (35): తండ్రి రషీద్, మసూద్ నగర్, ఖానాపూర్, ఆదిలాబాద్ జిల్లా.

అక్రమ తవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు

ప్రభుత్వ అనుమతులు లేకుండా మట్టి, ఇసుక, ఇతర ఖనిజ సంపదను తవ్వడం, నిల్వ చేయడం, రవాణా చేయడం చట్టరీత్యా నేరమని మావల ఎస్‌హెచ్‌ఓ బి.డి. ప్రేమ్ కుమార్ హెచ్చరించారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

అక్రమ మట్టి తవ్వకాలు, ఇసుక రవాణా లేదా ఇతర ఖనిజ సంపద అక్రమ తరలింపునకు సంబంధించిన సమాచారం తెలిస్తే జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాట్సాప్ నంబర్ 8712659973కు తెలియజేయాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE