e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

ప్రభుత్వ పాఠశాలల్లో ‘సీఎం అల్పాహారం’ పథకాన్ని అమలు చేయాలి

ప్రభుత్వ పాఠశాలల్లో ‘సీఎం అల్పాహారం’ పథకాన్ని అమలు చేయాలి

విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి పౌష్టికాహారం ఎంతో అవసరం – జిల్లా కలెక్టర్‌కు తెలంగాణ మాదిగ జేఏసీ నాయకుల వినతి

మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 16,

ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రత్యేకంగా ‘సీఎం అల్పాహారం’ పథకాన్ని ప్రారంభించి అమలు చేయాలని తెలంగాణ మాదిగ జేఏసీ నాయకులు కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించి, జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రతిరోజూ నాణ్యమైన, పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలోని అనేక గ్రామీణ, గిరిజన, వెనుకబడిన ప్రాంతాల్లో పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉదయం సరైన అల్పాహారం తీసుకోకుండానే పాఠశాలలకు వస్తున్నారని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొంతమంది విద్యార్థులకు ఉదయం పూట పౌష్టికాహారం అందడం లేదని, దీనివల్ల ఆకలి, నీరసం, పోషకాహార లోపం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితులు విద్యార్థుల చదువుపై ఏకాగ్రత, ఆసక్తి, పాఠశాల హాజరుపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం పూట పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం అందిస్తే విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు చదువుపై ఆసక్తి, ఏకాగ్రత పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పేద, దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఈ పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు.

కావున ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ‘సీఎం అల్పాహారం’ పథకాన్ని ప్రారంభించాలని కోరారు. మొదటి విడతలో పేద, గిరిజన, దళిత, వెనుకబడిన వర్గాల విద్యార్థులు అధిక సంఖ్యలో చదువుతున్న పాఠశాలలకు ప్రాధాన్యత ఇచ్చి, అనంతరం జిల్లా వ్యాప్తంగా పథకాన్ని విస్తరించాలని విజ్ఞప్తి చేశారు.

విద్యార్థుల ఆకలి తీర్చడం, ఆరోగ్యాన్ని పరిరక్షించడం, విద్యలో మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యతగా భావించి తమ విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించాలని కలెక్టర్‌ను కోరారు. సంబంధిత శాఖల అధికారులతో చర్చించి పథకం అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఈ వినతిపత్రం సమర్పించిన వారిలో తెలంగాణ మాదిగ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నక్క రాందాస్ మాదిగ, జిల్లా అధ్యక్షులు మల్యాల మనోజ్ మాదిగ, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ మోతే బారికరావు మాదిగ, జిల్లా కోశాధికారి లింగంపల్లి ప్రసన్నకుమార్ మాదిగ ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE