e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో CRT ఉపాధ్యాయుడు పురుషోత్తం కృషి అభినందనీయం

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో CRT ఉపాధ్యాయుడు పురుషోత్తం కృషి అభినందనీయం

బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు – ఉపాధ్యాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు

మన భారత్, భీంపూర్: నవంబర్ 14 ,బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని భీంపూర్ మండలంలోని బెల్సరీ రాంపూర్ ప్రాథమిక గిరిజన ఉన్నత పాఠశాల విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. బాలలే దేశ భవిష్యత్తుకు పునాదులని, ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైనది. ఈ క్రమంలో బెల్సరీ రాంపూర్ ప్రాథమిక గిరిజన ఉన్నత పాఠశాలలో CRT ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న కుడిమెత పురుషోత్తం విద్యార్థులకు విద్యాబోధన అందించడంలో చూపుతున్న అంకితభావం అభినందనీయమని పేర్కొన్నారు.

విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందిస్తూ, వారి భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసేలా ఉపాధ్యాయులు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లోని పిల్లలకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించడం ద్వారా వారి ప్రతిభను వెలికితీయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.

విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తూ, వారికి స్వచ్ఛమైన, నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రయత్నిస్తున్న CRT ఉపాధ్యాయుడు కుడిమెత పురుషోత్తంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. విద్యార్థులందరూ ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణ, పట్టుదలతో చదువులో రాణించాలని ఆకాంక్షించారు.

రిపోర్టర్: గేడం రమాకాంత్, భీంపూర్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE