e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

గోవింద్‌పూర్ అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించిన టీచర్ మరప ప్రేమలత

ఆటపాటలతో సందడిగా బాలల దినోత్సవ వేడుకలు

గోవింద్‌పూర్ అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించిన టీచర్ మరప ప్రేమలత

మన భారత్, భీంపూర్: నవంబర్ 14 ,బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని భీంపూర్ మండలంలోని మారుమూల గ్రామమైన గోవింద్‌పూర్‌లో అంగన్‌వాడీ కేంద్రం వద్ద చిన్నారుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అంగన్‌వాడీ టీచర్ మరప ప్రేమలత ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా అంగన్‌వాడీ చిన్నారులను ఆటపాటలతో అలరించారు. వివిధ ఆటలు, పాటల కార్యక్రమాల ద్వారా పిల్లల్లో ఉత్సాహాన్ని నింపారు. చిన్నారులు ఆనందంగా కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేశారు. బాలల దినోత్సవం ప్రాధాన్యతను తెలియజేస్తూ పిల్లలకు ఆనందకరమైన వాతావరణాన్ని కల్పించారు.

మారుమూల గ్రామాల్లో చిన్నారుల బాల్యం, ఆరోగ్యం, విద్యాభివృద్ధికి అంగన్‌వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆటలు, పాటలు, సృజనాత్మక కార్యక్రమాల ద్వారా పిల్లల్లో మానసిక వికాసం, సామాజిక నైపుణ్యాలు పెంపొందించేందుకు అంగన్‌వాడీ సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.

చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు నింపుతూ బాలల దినోత్సవాన్ని ఆనందోత్సాహాల మధ్య నిర్వహించిన అంగన్‌వాడీ టీచర్ మరప ప్రేమలతను అభినందించారు.

రిపోర్టర్: గేడం రమాకాంత్, భీంపూర్.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE