e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

కరవు మండలంగా ప్రకటించే వరకు సమావేశాలకు దూరం..

తలమడుగును కరవు మండలంగా ప్రకటించే వరకు సమావేశాలకు దూరం

సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించిన మండల సర్పంచులు.. ఏకగ్రీవ తీర్మానం

మన భారత్, తలమడుగు:నవంబర్ 12,

తలమడుగు మండలంలో నెలకొన్న కరవు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మండలాన్ని కరవు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మండల సర్పంచులు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశాన్ని సర్పంచులంతా మూకుమ్మడిగా బహిష్కరించారు.

మండలంలోని పలు గ్రామాల్లో వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయ రంగంలో నెలకొన్న ఇబ్బందుల నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళన ఎదుర్కొంటున్నారని సర్పంచులు పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ తలమడుగు మండలాన్ని కరవు మండలాల జాబితాలో చేర్చకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రభుత్వం తలమడుగు మండలాన్ని అధికారికంగా కరవు మండలంగా ప్రకటించే వరకు మండల స్థాయిలో నిర్వహించే సర్వసభ్య సమావేశాలకు హాజరుకాకూడదని సర్పంచులంతా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. తమ డిమాండ్ పరిష్కారమయ్యే వరకు ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.

అనంతరం సర్పంచులు తీసుకున్న ఏకగ్రీవ తీర్మానాన్ని నివేదిక రూపంలో ప్రభుత్వానికి పంపించారు. మండలంలోని కరవు పరిస్థితులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు చేపట్టాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్, తహసీల్దార్ రాజ్ మోహన్, తలమడుగు మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE