e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

ఖానాపూర్ చెరువు పరిసర ప్రాంతాల్లో సమస్యలపై సాజిద్ ఖాన్ క్షేత్రస్థాయి పరిశీలన

ఖానాపూర్ చెరువు పరిసర ప్రాంతాల్లో సమస్యలపై సాజిద్ ఖాన్ క్షేత్రస్థాయి పరిశీలన

మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 10,

ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్ చెరువు పరిసర ప్రాంతాల్లో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ అధికారులను కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఖానాపూర్ చెరువు పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించి, అక్కడి పరిస్థితులను పరిశీలించారు.

ఈ సందర్భంగా చెరువు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న స్థానిక ప్రజలతో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తెలిపిన సమస్యలను అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. స్థానికుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించేలా తగిన చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ సందర్భంగా సాజిద్ ఖాన్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రజల సంక్షేమం, ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తామని స్పష్టం చేశారు.

ఖానాపూర్ చెరువు పరిసర ప్రాంతాల సమస్యలపై చేపట్టిన ఈ క్షేత్రస్థాయి పరిశీలనతో స్థానిక సమస్యలు అధికారుల దృష్టికి వెళ్లాయని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE