e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

బొరిగాం అభివృద్ధికి రూ.3.30 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణం

బొరిగాం అభివృద్ధికి రూ.3.30 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణం

పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్.. నూతన ఎంపీపీఎస్ పాఠశాల ప్రారంభం

మన భారత్, నేరడిగొండ:నవంబర్ 4,

నేరడిగొండ మండలంలోని బొరిగాం గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామంలో వర్షపు నీటి ప్రవాహం వల్ల ఇబ్బందులు తలెత్తకుండా రూ.3 కోట్ల 30 లక్షల వ్యయంతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఎంపీపీఎస్) భవనాన్ని ప్రారంభించారు.

అదేవిధంగా గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రూ.10 లక్షలతో మహిళా సంఘ భవన నిర్మాణానికి, మరో రూ.10 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి, రూ.10 లక్షలతో జగదాంబ దేవి ఆలయానికి ప్రహరీ గోడ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. గ్రామంలో వర్షపు నీటి సమస్యకు పరిష్కారం చూపేందుకు రూ.3.30 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలకు సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు కమ్యూనిటీ హాల్, మహిళా సంఘాల కార్యకలాపాలకు అనువుగా మహిళా సంఘ భవనం నిర్మిస్తున్నట్లు వివరించారు. జగదాంబ దేవి ఆలయానికి ప్రహరీ గోడ నిర్మాణం కూడా చేపడుతున్నామని పేర్కొన్నారు.

గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం ద్వారా నిధులు కేటాయించి వివిధ పనులు చేపడుతున్నామని, గ్రామస్తులు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామంలో ఎలాంటి విభేదాలు, గొడవలకు తావివ్వకుండా ప్రతి ఒక్కరూ పరస్పర ప్రేమాభిమానాలతో, ఐకమత్యంతో మెలగాలని కోరారు. మనుషుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు ఉండాలని, గ్రామ ప్రజలందరూ కలిసిమెలిసి ఉంటేనే అభివృద్ధి మరింత వేగంగా సాగుతుందని అన్నారు. బొరిగాం గ్రామానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, గ్రామ సర్పంచ్ వినేశ్, ఉపసర్పంచ్ సంగీత బాయి, మాజీ సర్పంచ్ పవన్, పండరీ, రవీందర్ రెడ్డి, శివారెడ్డి, శ్రీకాంత్, జీవన్, రాథోడ్ సురేందర్, భూషణ్, మెర్సింగ్, మున్న నాయక్, చరణ్ నాయక్, నాయక్, కరోబారి, డావ్, గెరియా, గంగారాం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE